అల్లు అర్జున్ చుట్టూ చాలామంది దర్శకులు తిరుగుతున్నారు. కానీ.. బన్నీనే నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తున్నాడు. ఇప్పటికే ఖరారైపోయిన సినిమాల్ని సైతం బన్నీ ఆలస్యం చేస్తున్నాడు. బన్నీతో ఇది వరకే సినిమాని ఖరారు చేసుకున్న దర్శకుడు విక్రమ్ కె.కుమార్. బన్నీ – విక్రమ్ ల నుంచి సినిమా వస్తుందని అధికారిక ప్రకటన కూడా వచ్చి, రెండేళ్లయ్యింది. అయితే ఇప్పటి వరకూ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. నిజానికైతే.. బన్నీ – విక్రమ్ ల సినిమా ఉంటుందన్న విషయాన్ని సైతం జనాలు మర్చిపోయారు.
కానీ… విక్రమ్ మాత్రం ఈ ప్రాజెక్టుపై ఆశలు వదల్లేదు. `బన్నీతో సినిమా ఉంటుంది. అది నా కలల ప్రాజెక్టు. ప్రస్తుతం స్క్రిప్టు సిద్ధం చేస్తున్నా` అంటున్నాడు విక్రమ్. `గ్యాంగ్ లీడర్` సినిమా హిట్టయితే, వెంటనే బన్నీ విక్రమ్ కి లైన్ క్లియన్ చేసేద్దును. కానీ ఆ సినిమా ఆడలేదు. అంతకు ముందు తీసిన `హలో` కూడా నిరాశ పరిచింది. ఎప్పుడూ హిట్ దర్శకుల వెంట పడే.. బన్నీ, విక్రమ్ కి ఛాన్స్ ఇవ్వడానికి వెనకడుగు వేశాడు. అందుకే ఈ కాంబో లేట్ అయ్యింది. ప్రస్తుతం నాగ చైతన్యతో `థ్యాంక్యూ`ని తెరకెక్కిస్తున్నాడు. ఆ సినిమాతో విక్రమ్ మార్క్ చూపించగలిగితే, బన్నీ నుంచి క్లియరెన్స్ వస్తుంది. బన్నీ కి కూడా ఇప్పుడు ఓ మంచి కథ అవసరం. ఎందుకంటే.. పుష్ష తరవాత ఎలాంటి సినిమా చేయాలి? అనే విషయంలో బన్నీ ఇంకా ఏ నిర్ణయానికీ రాలేదు. సో… విక్రమ్ కె.కుమార్ కి ఇంకా తలుపులు తెరచే ఉన్నాయి.