ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో సవ్యసాచి సినిమా చేస్తున్నాడు నాగచైత్యన. ఈ సినిమా తర్వాత ఆయన చేయబోయే కొత్త సినిమా ఫిక్సయిపోయింది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు చైతు. ఈ విషయాన్ని నాగార్జున స్వయంగా వెల్లడించారు.
13 బి, ఇష్క్, మనం, 24…. ఇలా ఒక కథకీ మరో కథకీ లింకు లేకుండా సినిమాలు తీశాడు విక్రమ్ కె.కుమార్. అక్కినేని మూడు తరాల హీరోల్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చిన మనం సినిమా అయితే ఒక క్లాసిక్ గా నిలిచి పోయింది. ప్రస్తుతం అక్కినేని హీరో అఖిల్ తో ‘హలో’ సినిమా చేస్తున్నాడు విక్రమ్. ఈ సినిమా విడుదలకు సిద్దమైయింది.
ఈ సినిమా తర్వాత కూడా మరోసారి అక్కినేని హీరోతోనే ఫిక్సయ్యాడు. అక్కినేని నాగచైతన్యతో ఆయన సినిమా ఫిక్సయింది. ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున వెల్లడించాడు. ”నాగచైతన్య విక్రమ్ కలయికలో సినిమా రానుంది. హలో సినిమా తర్వాత చైతన్య సినిమా మొదలుపెడతారు విక్రమ్.” అని వెల్లడించారు నాగ్. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తారు.