రాజమౌళి ఎంచుకున్న ఒకే ఒక్క పోలీస్ స్టోరీ.. విక్రమార్కుడు. ఖాకీ కథల్లో ఈ సినిమాకి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ కూడా రూపుదిద్దుకుంటోంది. `విక్రమార్కుడు 2` తెరపైకి రాబోతోందని ఆమధ్య రకరకాల వార్తలొచ్చాయి. వాటిపై విజయేంద్ర ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. `విక్రమార్కుడు 2`కి సంబంధించిన కథ సిద్ధమైందని చెప్పేశారు. అయితే ఈ సినిమా తెలుగులో రావడం లేదు. నేరుగా బాలీవుడ్ లో తెరకెక్కబోతోంది. విక్రమార్కుడు హిట్టయ్యాక బాలీవుడ్ లో రౌడీ రాథోడ్ పేరుతో ఈ సినిమాని రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. అక్షయ్ కుమార్ హీరోగా, ప్రభుదేవా దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. అక్కడ కూడా సూపర్ హిట్టయ్యింది. ఇప్పుడు ఈ సీక్వెల్ బాలీవుడ్ కి వెళ్లబోతోంది.
నిజానికి ఈ సినిమాని తెలుగులో రవితేజతో చేయాలని విజయేంద్ర ప్రసాద్ భావించారు. సంపత్ నంది ఈ కథని రవితేజ దగ్గరకు తీసుకెళ్లాడు. నిర్మాతలు కూడా రెడీ.కాకపోతే.. రవితేజ మాత్రం ఈ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించాడట. ఈ సినిమా చేస్తే రాజమౌళితోనే చేస్తా అన్నాడట. రాజమౌళినా ఇప్పట్లో దొరకడు. మరోవైపు రవితేజ కూడా ఫుల్ బిజీ. అందుకే రవితేజ – సంపత్ నంది కాంబోలో రావాల్సిన విక్రమార్కుడు 2 పట్టాలెక్కకుండా ఆగిపోయింది. ఇప్పుడు ఈ కథ బాలీవుడ్ కి వెళ్తోంది కాబట్టి, అక్కడ హిట్టయితే అప్పుడు తెలుగులో రీమేక్ చేస్తారేమో..?