ఈమధ్య వార్తల్లోకి వచ్చిన సీక్వెల్… విక్రమార్కుడు 2. రాజమౌళి – రవితేజ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న సినిమా ఇది. మాస్ అనే పదానికి ఈ సినిమా అచ్చమైన నిర్వచనంలా ఉంటుంది. అప్పట్లో మిగిలిన భాషల్లోనూ ఈ సినిమా రీమేక్ అయ్యింది. ఇప్పుడు సీక్వెల్ ఆలోచన వచ్చింది.
విక్రమార్కుడు 2 కథని రచయిత విజయేంద్ర ప్రసాద్ సిద్ధం చేశారు. అయితే రాజమౌళి కోసం కాదు. ఓ నిర్మాత కోసం. ఆ నిర్మాత ఈ కథని సంపత్ నందితో తెరకెక్కించాలని చూస్తున్నాడు. హీరోగా రవితేజనే అనుకున్నా.. రవితేజకు ఇప్పుడు కొత్త సినిమాలు సంతకాలు చేసేంత తీరిక లేదు. తను మరో రెండేళ్ల వరకూ బిజీనే. అందుకే ఈ సీక్వెల్ లో రవితేజకు బదులుగా మరో హీరోని ఎంచుకోవాలని చూస్తున్నారు. అలా హీరో, దర్శకుడు మారితే.. విక్రమార్కుడు 2 అనే టైటిల్ ఉంటుందా? లేదా? అనేది అనుమానం. ఎందుకంటే ఇద్దరిలో ఎవరు మారినా, అదే టైటిల్ తో సినిమా చేయడం అనవసరం. అలా చేస్తే… అదో కొత్త పంథా అవుతుంది. విజయేంద్ర ప్రసాద్ కి మాత్రం ఈ సినిమాని పూర్తిగా విక్రమార్కుడు స్టైల్ లోనే రాశార్ట. మరి ఇప్పుడు టైటిల్ మారుస్తారేమో చూడాలి. ఆ హీరో ఎవరన్నది తేలితే.. ఈ సినిమాపై ఓ క్లారిటీ వస్తుంది.