పొన్నియన్ సెల్వన్ తర్వాత విక్రమ్ నుంచి వస్తున్న చిత్రం ‘వీర ధీర శూరన్’. దుషారా విజయన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎస్జే సూర్య కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఎస్‌యూ అరుణ్‌కుమార్ దర్శకుడు. తాజాగా టీజర్ ని రిలీజ్ చేశారు.
ఇదొక బాషా, పోకిరి టైపు కథ. విక్రమ్ తన భార్య, బిడ్డలతో ఓ ఊర్లో ఓ కిరాణ షాప్ నడుపుతూ హాయిగా బ్రతికేస్తుంటాడు. కానీ అతని జీవితంలో ఓ చీకటి కోణం వుంది. తన కోసం పోలీసులు, రౌడీ షీటర్లు గాలిస్తుంటారు. తనకో గ్యాంగ్‌స్టర్ నెట్ వర్క్ తో లింక్ వుంటుంది. తన అసలు ఇడెంటిటీని దాచి అజ్ఞాతంలో బ్రతుకుతుంతాడు. విక్రమ్ మిషన్ ఏమిటి ? ఈ అజ్ఞాతవాసం ఎందుకనేది అసలు కథ.
టీజర్ లో యాక్షన్ సీన్స్ కి పెద్ద పీట వేశారు. విక్రమ్ ఎప్పటిలానే యాక్షన్ లో అదరగొట్టాడు. తన లుక్ కొత్తగా వుంది. ఎస్జే సూర్య పాత్ర కూడా కథలో కీలకం. టీజర్ తనకీ మంచి ఎలివేషన్స్ పడ్డాయి. జీవి ప్రకాష్ కుమార్ బీజీఎం మరో ఆకర్షణ. సినిమా షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుంది. 2025 జనవరిలోనే సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.