ఎన్నికల్లో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పాత్రపై ఈసీ స్పష్టత ఇచ్చింది. ఓటర్ల వేలుకు ఇంకు పూసే విధులు మాత్రమే అప్పగించాలని ఇతర కీలక విధఉలు ఏమీ అప్పగించవద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు సీఈవోకు ఉత్తర్వులు పంపింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధులకు తీసుకోవడంపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీనిపై ఆయన ఈసీకి లేఖ రాశారు. పరిశీలన జరిపిన ఈసీ ఎన్నికల విధుల్లోకి సచివాలయ సిబ్బందిని తీసుకునేందుకు అభ్యంతరం లేదని అయితే.. కలెక్టర్లు, అధికారులకు సీఈవో సూచనలు చేసింది.
సిబ్బందిని పోలింగ్ పార్టీలుగా సార్వత్రిక ఎన్నికల్లో విధులు అప్పగించవచ్చని తెలిపింది. ఈసీ సూచనతో ఎన్నికల ప్రధాన విధులు అప్పగించవద్దని సీఈవో రిటర్నింగ్ అధికారులకు లేఖలు రాశారు. ఇంకు పూసే పనులు, ఇతర విధులు మాత్రమే అప్పగించాలని సూచనలు చేశారు ప్రతీ పోలింగ్ పార్టీలోనూ రెగ్యులర్ సచివాలయ ఉద్యోగిని నియమించుకోవచ్చని.. బీఎల్వోలుగా పనిచేసిన సిబ్బందిని పోలింగ్ విధుల్లోకి తీసుకోవద్దని స్పష్టం చేశారు. బీఎల్వోలకు పోలింగ్ రోజు ఇతర పనులు అప్పగించేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఈసీ తెలిపింది.
వాలంటీర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల విధులు అప్పగించవద్దని.. అభ్యర్థులకు పోలింగ్ ఏజెంట్లుగానూ వాలంటీర్లను అనుమతించవద్దని స్పష్టం చేసింది. దీంతో ఎన్నికలకోడ్ వచ్చిన వెంటనే వాలంటీర్ల వద్ద ఉండే ప్రభుత్వ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. వాలంటీర్లపై ఆశలు పెట్టుకున్న జగన్ రెడ్డి వారికి పెద్ద ఎత్తున బహుమతుల పేరుతో డబ్బులు పంచేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.