శ్రీకాకుళం జిల్లాలో తుఫాను చేసిన బీభత్సం అంతా ఇంతా కాదు. పవన్కళ్యాణ్ , తుపాను ధాటికి దెబ్బతిన్న శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా గ్రామస్థులు ఇచ్చిన ఫిర్యాదు విని పవన్ కళ్యాణ్ ఖంగుతిన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరుగుతున్న సహాయ కార్యక్రమాల గుట్టు విప్పాడు.
పవన్ కళ్యాణ్ , నాదెండ్ల మనోహర్ తో కలిసి తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తుండగా, చాలా మంది గ్రామస్తులు, అందిన అరకొర సహాయంపై ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో, కూరగాయలు 30 కుటుంబాల కు కలిపి ప్రభుత్వం 500 రూపాయలు ఇచ్చిందని వాపోయారు. ఒక గ్రామంలో తుఫాను కారణంగా దాదాపు 30 కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. వారికి బియ్యం పంపిణీ చేసిన ప్రభుత్వం, కూరగాయలు కొనడానికి 500 రూపాయలు ఇచ్చింది. అయితే ఒక్కో కుటుంబానికి ఐదు రూపాయలు ఇచ్చింది ఏమోనని పవన్ కళ్యాణ్ ఆ విషయాన్ని ముందు పట్టించుకోలేదు. అయితే గ్రామస్తులు మొత్తం 30 కుటుంబాలకు కలిపి ఐదు వందల రూపాయలు ఇచ్చారని వివరించేసరికి అది విన్న నాదెండ్ల మనోహర్, పవన్ కళ్యాణ్ ఖంగుతిన్నారు.
హుదూద్ తుఫాన్ సమయంలో ఎంతో సమర్థవంతంగా వ్యవహరించి, పరిస్థితులు చక్కబెట్టిన చంద్రబాబు , ఆయన ప్రభుత్వం ఈ శ్రీకాకుళం తుఫాన్ విషయంలో, ప్రచారానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి, సహాయ కార్యక్రమాలని తూతూమంత్రంగా చేస్తుండడం ఏమిటని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.