నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన సింహా, లెజెండ్ రెండూ బ్లాక్‌బస్టర్ హిట్లే. ఆ కాంబినేషన్లో సినిమా అంటే అంచనాలు ఆకాశంలో ఉంటాయ్. అందుకే ఈ వచ్చే మూడో సినిమాపై బోయపాటి ప్రత్యేక దృష్టి పెట్టాడు.. ఆర్టిస్టులు, టెక్నీషియన్ల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. బోయపాటి సినిమాల్లో విలన్ పాత్ర.. హీరో పాత్రకు ఏ మాత్రం తగ్గని రీతిలో ఉంటుంది. ఈ రోజు జగపతిబాబు స్టార్ విలన్‌గా ఓ వెలుగు వెలుగుతున్నాడంటే కారణం లెజెండ్‌లో ఆయన చేసిన విలన్ పాత్రే.
త్వరలోనే షూటింగ్ జరుపుకోనున్న ఈ తాజా చిత్రంలో కూడా విలన్ పాత్ర చాలా కీలకమని తెలుస్తోంది. ఆ పాత్రను శ్రీకాంత్‌ని ఎంచుకున్నట్లు వార్తలు కూడా వచ్చాయ్. అయితే ఆ వార్తలో ఏ మాత్రం నిజంలేదనేది తాజా సమాచారం. ఈ సినిమాలో శ్రీకాంత్ నటించడం లేదని, ఓ ప్రముఖ కథానాయకుడే విలన్ పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది. ఈమధ్య బాలయ్య సినిమాలో విలన్ గా నటించడానికి నేను సిద్ధం.. అని రాజశేఖర్ పచ్చ జెండా ఊపాడు. ఇప్పుడు బోయపాటి మనసులో కూడా రాజశేఖరే ఉన్నట్టు తెలుస్తోంది. బాలయ్య కూడా సరే అంటే రాజశేఖర్‌ని విలన్‌గా చూడొచ్చు. మరి ఆ ఛాన్సు ఎవర్ని వరిస్తుందో చూడాలి..