కథల ఎంపికలో చిరంజీవి జడ్జిమెంట్‌కు తిరుగుండదని చెబుతారు. సినిమా కథకు సంబంధించిన కమర్షియల్ అవుట్‌కమ్‌ను ఆయన బాగా అంచనా వేస్తారని అంటారు. మెగాహీరోల సినిమాల కథలన్నింటిని చిరంజీవికి చెప్పాకే ఫైనల్ చేస్తారు. రంగస్థలం సినిమా విషయంలో రామ్‌చరణ్‌ను చిరంజీవి ఎంతగానో ప్రోత్సహించారని, ఆ సినిమా చరణ్ కెరీర్లో లాండ్మార్క్ఫిల్మ్స్ అవుతుందని చిరు ముందుగానే ఊహించారని చెబుతారు. అయితే వినయ విధేయ రామ చిత్రంలో చిరంజీవి అంచనాలన్ని తప్పాయి. ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే ముందు బోయపాటి శ్రీను చెప్పిన సబ్జెక్ట్‌లో సింగిల్ లైన్ కూడా మార్చాల్సిన అవసరం లేదని చిరంజీవి చెప్పారట. అయన ఆదేశించినట్లుగానే యథాతథంగా సినిమాను తీశారు. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ రేసులో చతికిలపడింది. సినిమాలోని కొన్నిసన్నివేశాల్ని చూసి ప్రేక్షకులు నవ్వుకునే పరిస్థితి ఉంది.ఎంత క్రియేటివ్ లిబర్టీస్ తీసుకున్నా లాజిక్‌లెస్‌గా వున్న కొన్ని సీన్స్ చూసి ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలు రంగస్థలం వంటి చిరస్మరణీయ విజయం తర్వాత రామ్‌చరణ్‌తో ఈ సినిమా ఎందుకు చేయించారని అభిమానులు మదనపడుతున్నారు. వినయ విధేయ రామ విషయంలో చిరంజీవి జడ్జిమెంట్ పూర్తిగా తప్పిందని మెగాభిమానులు బాధపడుతున్నారట.