మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. రామ్‌చరణ్ కొత్త సినిమా టైటిల్ తో పాటు, లుక్ కూడా బయటపెట్టేశారు. దీపావళి సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన లుక్ విడుదల చేస్తారని ముందు నుంచీ చెప్పుకుంటూనే ఉన్నారు. దానికి తగ్గట్టుగానే… దీపావళి కానుక ఇచ్చేసింది చిత్రబృందం. `వినయ విధేయ రామ` అనే టైటిల్‌ని కూడా ఫిక్స్ చేసేసింది.
బోయపాటి సినిమాల్లో హీరోలు మాస్ లుక్‌తోనే కనిపిస్తుంటారు. టైటిల్‌కి తగ్గట్టుగా బోయపాటి ట్రెడీషనల్ లుక్‌తో షాక్ ఇస్తాడనుకున్నారు. కానీ తన స్టైల్‌కి తగ్గట్టుగా మాస్ లుక్‌నే దింపాడు. ఓ ఫైట్ సీన్లో.. చరణ్ వీరత్వం చూపించే షాట్ అది. వీర, రౌద్ర రసాలు పండిస్తున్న చరణ్ లుక్‌ని ఫస్ట్ లుక్‌గా విడుదల చేసింది. దాదాపు 80 శాతం చిత్రీకరణ పూర్తయ్యింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.