భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రెజ్లింగ్ కు రిటైర్మెంట్ ప్రకటించారు.
కుస్తీ నాపై గెలిచింది. నేను ఓడిపోయాను. నన్ను క్షమించండి..నాపై మీరు పెట్టుకున్న నమ్మకం చెదిరిపోయింది. ఇంకా నాకు పోరాడే బలం లేదంటూ ఎక్స్ లో పేర్కొన్న వినేష్ ఫోగట్ రెజ్లింగ్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది.
ఒలంపిక్స్ పతకం ఖాయం అనుకుంటున్న క్రమంలోనే వినేష్ పై నిర్ణీత బరువు కంటే అదనపు బరువు ఉన్నారని ఆమెపై అనర్హత వేటు వేశారు. 50కిలోల విభాగంలో ఆమె ఫైనల్స్ కు చేరగా… 100గ్రాముల బరువు ఎక్కువగా ఉందంటూ అనర్హత వేటు వేశారు.
మరోవైపు తనను అనర్హురాలిగా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ ఫోగట్ కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ ను ఆశ్రయించింది. తను సిల్వర్ మెడల్ కు అర్హురాలిని అంటూ పేర్కొనగా.. దీనిపై ఆర్బిట్రేషన్ ఎలాంటి నిర్ణయాన్ని వెలువరిస్తుందో చూడాలి.
ఈ క్రమంలోనే వినేష్ ఫోగట్ రెజ్లింగ్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.