రాజకీయం అంటే రాజకీయమే. దానికి మంచి మానవత్వం ఉండదని మరోసారి నిరూపితమవుతోంది. రెజ్లర్ వినేశ్ ఫోగట్ బంగారు పతకం తెస్తారని అందరూ ఎదురు చూస్తున్న సమయంలో ఆమె ఉండాల్సిన బరువు కన్నా వంద గ్రాములు ఎక్కువ ఉన్నారని అనర్హతా వేటు వేశారు.ఎక్కువ బరువుతోనే పోటీలన్నీ గెలిచారు. వినేశ్ 50 కేజీల విభాగంలో పోటీ పడ్డారు కానీ ఉండాల్సిన బరువు కన్నా వంద గ్రాములు ఎక్కువగా ఉన్నారు. దాంతో ఐఓసీ నిబంధనల ప్రకారం అనర్హతా వేటు తప్పలేదు.
వినేశ్ ఫోగట్ అనర్హతా వ్యవహారంతో దేశంలో రాజకీయం రాజుకుంది. గతంలో ఆమె రెజ్లింగ్ ఫెడరేషన్ కు చెందిన బ్రిజ్ భూషణ్‌పై లైంగిక ఆరోపణలు చేసి పోరాడినందున బీజేపీ కుట్ర చేసిందని సోషల్ మీడియాలో కొంత మంది ప్రచారం చేశారు. కార్టూన్లు వేశారు. విపక్ష పార్టీలు కూడా అదే అర్థం వచ్చేలా ఆరోపణలు చేశాయి. పార్లమెంట్ లో ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు . ఐఓసీతో మాట్లాడాలని.. వినేశ్‌కు న్యాయం చేయాలని వాదించారు. అంతే కాదు..ఆమె బరువు సహా అన్ని విషయాలను చూసుకోవాల్సిన టీమ్ ఎక్కడుందని ప్రశ్నించడం ప్రారంభించారు. వీటి వెనుక ఉన్న కుట్ర సిద్ధాంతాలనూ తెరపైకి తెచ్చారు.
నిజానికి ఒలింపిక్స్‌లో రూల్స్ అంటే రూల్సే. బయటక వ్యక్తులు కాదు.. ప్రభుత్వాలు కూడా ఆటల్లో ఫలితాలను కానీ.. మరో విధంగా నిర్ణయాలను కానీ ప్రభావితం చేయలేవు. కానీ ఇండియాలో మాత్రం.. ప్రజలు రకరకాలుగా అనుకునేలా.. రాజకీయం చేయడంలో మాత్రం పార్టీలు రాటుదేలిపోయాయి. అసలే విషాదంలో ఉన్న వినేశ్‌కు ఇండియాలో పార్టీల అతి మరింత కష్టం అనుకోవచ్చు.
Also read : వినేష్ ఫోగట్ కు అస్వస్థత
నిజానికి వినేశ్ ఫోగట్ పోటీ పడాల్సింది 53 కేజీల విభాగంలోనే. కానీ విభాగంలో మరో క్రీడాకారణి అర్హత సాధించడంతో 50కేజీల విభాగానికి మారాల్సి వచ్చింది. ఆ బరువును మెయిన్‌టెయిన్ చేయడం.. సమస్యగా మారడంతో చేతిలోకి వచ్చిన పతకం చేజారిపోయింది. కానీ దేశం మొత్తం ఆమెకు అండగా ఉంటోంది.