బాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకొంది. అలనాటి అందాల నటుడు ‘వినోద్ ఖన్నా కొద్ది పేపటి క్రితమే తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా తీవ్ర అస్వస్థతతో బాధ పడుతున్న వినోద్ ఖన్నా ముంబైలోని హెచ్ ఎన్ రిలయెన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొంతకాలం క్రితం వినోద్ ఖన్నా డీ హైడ్రేషన్ కారణంగా ఆసుపత్రిలో చెరినట్టుగా కుటుంబ వర్గాలు తెలిపాయి. అయితే ఆయనకు క్యాన్సర్ ఉందని, అది బాగా ముదిరి పోయి కన్నుమూశారని ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. దాదాపు 141 చిత్రాల్లో నటించిన వినోద్ ఖన్నా చివరి చిత్రం ‘దిల్ వాలే’. నటుడిగానే కాక రాజకీయాల్లోనూ తనదైన ముద్రవేశారు వినోద్ ఖన్నా కొంతకాలం కేంద్ర మంత్రిగా సేవలందించారు.