ఒక పక్క ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం మొత్తం యుద్ధ వాతావరణం తలపిస్తోంది. రైతులు, ప్రజలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. వేలాది మంది పోలీసులను మోహరించి మరీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించింది ప్రభుత్వం. ఈ సమయంలో అసెంబ్లీలో సీఎం జగన్ నిద్ర పోతూ కెమెరాల కి చిక్కడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నారా లోకేష్ ట్వీట్ చేస్తూ, “ఓ పక్క రాజధాని ప్రాంత రైతులు, ప్రజలు రోడ్డెక్కి అసెంబ్లీని ముట్టడిస్తుంటే… మరో పక్క రాష్ట్రం మొత్తం టీవీలు చూస్తుంటే… ఈ మనిషికి ఇలా ఎలా నిద్రపడుతోంది?” అంటూ ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో కూడా జగన్ నిద్రపోతున్న ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. రోమ్ తగులబడుతుంటే ఫిడేల్ వాయించిన నీరో చక్రవర్తి లాగా, రాజధానిలో రైతులు రోడ్లమీద ఆందోళన చేస్తుంటే జగన్ హాయిగా నిద్రపోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. మరికొందరేమో, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి అసెంబ్లీ వేదికగా జగన్ కలలు కంటున్నాడు అంటూ ఎద్దేవా చేశారు.
మొత్తానికి జగన్ అసెంబ్లీలో నిద్రపోతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఓ పక్క రాజధాని ప్రాంత రైతులు, ప్రజలు రోడ్డెక్కి
అసెంబ్లీని ముట్టడిస్తుంటే… మరో పక్క రాష్ట్రం మొత్తం టీవీలు చూస్తుంటే… ఈ మనిషికి ఇలా ఎలా నిద్రపడుతోంది?#SaveAmaravati#MyCapitalAmaravati#APWithAmaravati pic.twitter.com/bMGVJ2sufI— Lokesh Nara (@naralokesh) January 20, 2020