చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వైయస్ జగన్ ఐదుగురు ఉప ముఖ్యమంత్రులని నియమించుకున్నారు. దీంతో అన్ని వర్గాలకు తగిన ప్రాధాన్యం ఇచ్చినట్టుగా జగన్ నిరూపించుకున్నాడని ప్రజల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. అయితే ఈ సందర్భంలో దాసరి నారాయణ రావు నటించిన ఎమ్మెల్యే ఏడుకొండలు చిత్రంలోని ఒక వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుత రాజకీయ సందర్భానికి సరిపోయినట్లుగా ఉన్న ఆ వీడియో చూసిన వాళ్ళందరూ దాసరి నారాయణరావు ముందు చూపు కి హాట్సాఫ్ అంటున్నారు.
వివరాల్లోకి వెళితే, ఎమ్మెల్యే ఏడుకొండలు సినిమాలో దాసరి నారాయణరావు ముఖ్యమంత్రి అవుతాడు. అప్పుడు తన క్యాబినెట్ లో ఉన్న అందరిని ఉప ముఖ్యమంత్రులు గా నియమించుకుంటాడు. అయితే ప్రెస్ మీట్ లో కొందరు ఈ విషయమై ముఖ్యమంత్రిగా ఉన్న దాసరి నారాయణరావుని అని ప్రశ్నిస్తారు – అసలు రాష్ట్రానికి ఇంత మంది ఉప ముఖ్యమంత్రులు ఎందుకు అని. దానికి దాసరి నారాయణరావు సమాధానమిస్తూ, ” ఇప్పుడు అప్పారావు గారు ఎలా గెలిచారో, సుబ్బారావు గారు అలాగే గెలిచారు, సుబ్బారావు గారు ఎలా గెలిచారో, వెంకట్రావు గారు అలాగే గెలిచారు, ఇలా అందరూ ఒకేలా గెలిచినప్పుడు, ఒకరిని ఉప ముఖ్యమంత్రిగా, మరి కొంతమందిని మంత్రులుగా, ఇంకొంత మందిని సహాయ మంత్రులుగా, మిగిలిన వారిని ఏ మంత్రి పదవి లేకుండ గా…, ఇలా ఎలా నియమించడం” అని ఎదురు ప్రశ్న వేస్తాడు దాసరి నారాయణరావు. దానిని కొనసాగిస్తూ “కాబట్టి, ముందు మా వాళ్ళలో అందరికీ సమానత్వం సాధిస్తే, ఆ తర్వాత దేశానికి సమానత్వం సాధించవచ్చని” సెలవిస్తాడు.
ఏది ఏమైనా, కొన్ని దశాబ్దాల కిందట దాసరి నారాయణరావు సెటైర్ గా తీసిన సీన్, ఇప్పటి రాజకీయాల్లో అన్వయించే లా ఉండడం, అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడం చూసినవారందరూ దాసరి నారాయణరావు ముందు చూపు కి హ్యాట్సాఫ్ అంటున్నారు.