మీడియాపై ఎవరైనా ఏదైనా ఒక మాట నోరు జరగాలంటే చాలా భయపడేవాళ్లు కొంతకాలం కిందటి వరకు. అయితే ఈమధ్య ట్రెండు కొంచెం మారినట్లు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ మీడియాపై యుద్ధం మొదలెట్టడం, ఆ తర్వాత ఆమధ్య వీరమాచినేని లైవ్ లో టీవీ 9 మీద దుమ్మెత్తి పోయడం, ఇప్పుడు ఈ స్వామిజీ మీడియా మీద ఒక రేంజ్లో విరుచుకుపడ్డ చూస్తుంటే తెలుగు మీడియా, ప్రత్యేకించి కొన్ని చానెళ్లు, ప్రజల్లో ఎంత చులకన అయ్యాయో తెలుస్తోంది.
హిందూ ధర్మం గురించి పోరాటం చేస్తున్న ఒక స్వామీజీ బృందం హైదరాబాదులో గవర్నర్ ను కలవడానికి వచ్చిన సందర్భంలో ఆ స్వామీజీ ని మాట్లాడమని మీడియా కోరింది. స్వామీజీ ఏదో రెండు మాటలు చెబుతాడు అనుకున్న మీడియాకి స్వామీజీ ఝలక్ ఇచ్చాడు. ఆయన ఏమన్నారంటే- “మీకు ప్రజలు సమస్యలు పట్టవు, మనుషులు పట్టరు, నీకు కావాల్సిందల్లా టీఆర్పీ రేటింగులు . మీ యాజమాన్యాలతో ఈ యాత్ర మొత్తం కవర్ చేస్తామని చెప్పించండి మీకు చేతనయితే. తెలుగు మీడియా మా యాత్రలు పట్టవు.మీరు మమ్మల్ని భుజానికి ఎత్తుకోరు. మీరు ఎవరిని భుజానికెత్తుకుంటారో మాకు తెలుసు. వాడు ఒక పనికిమాలినవాడు వాడికి గంటలు గంటలు ఇస్తారు. ఈరోజు మీడియా మొత్తం అమ్ముడుపోయింది. మీకు నైతిక విలువలు లేవు.మీకు వాస్తవాలతో సంబంధం లేదు. మీరు ఏ రోజు కూడా మా ధర్మ పోరాటాలకు మద్దతు ఇవ్వలేదు. అయినా మీ మద్దతు కోసం మేము పోరాటాలు చేయడం లేదు. వెళ్ళండి శ్రీ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు మీకు.. వాళ్ళతోనే ప్రోగ్రాం చేసుకోండి.. నిజాయితీగా చెప్పాలంటే ఇవాళ మీడియా చచ్చిపోయిన వాళ్ళ శవాల మీద పేలాలు ఏరుకుంటోంది.”
తెలుగు మీడియా పై ప్రత్యేకించి కొన్ని చానెళ్లపై ఈ స్థాయిలో వ్యతిరేకత రావడం ఆశ్చర్యకరం. అందులోనూ ఈ వీడియో ఎంతగానో ప్రజలు వైరల్ చేయడం చూస్తుంటే బహుశా ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని ఆ స్వామి కూడా చెప్పినట్టు అనిపిస్తోంది