ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌గా కితాబులు అందుకుంటున్న కోహ్లీ ఆటలు ఈ ఐపీఎల్ లో సాగడం లేదు. వరుసగా మూడు మ్యాచ్‌లలో తక్కువ స్కోర్లకే అవుటై వెనుదిరిగాడు. కోహ్లీ కి ఏమైందంటూ…అభిమానులు కలవరపెడుతున్నవేళ, వరుస వైఫల్యాలకు చెక్ పెడుతూ విరాట్ కోహ్లీ ఓ చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్‌లో సమయోచిత ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. 53 బంతుల్లో 2 సిక్సర్లు, 7 బౌండరీల సహయాంతో 72 పరుగులు చేసి టచ్‌లోకి వచ్చాడు. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 154 పరుగులు చేసింది. బదులుగా బ్యాటింగ్ కి దిగిన బెంగళూరు ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని అందుకుంది. కొహ్లీతో పాటుగా కొడక్కల్ మరోసారి సమయోచిత ఇన్నింగ్ (63) తో రాణించడంతో 8 వికెట్ల తేడాతో గెలుపు సాధించింది. ఈ ఐపీఎల్ లో అద్భుతంగా రాణిస్తున్న యువ బ్యాట్స్‌మెన్ కొడక్కల్ కి ఇది మూడో అర్థ సెంచరీ.