ఓ సినిమా విడుదలకు ముందే.. నిర్మాతల్ని సేఫ్ జోన్లో పడేయడం కంటే… విజయం మరోటి లేదు. ఎందుకంటే ఈ మధ్య ఏ సినిమా చూసినా.. నిర్మాతలకు చేదు అనుభవాల్నే మిగులుస్తోంది. మీడియం రేంజ్ హీరోల సినిమాలైతే సరేసరి. అయితే విరూపాక్ష మాత్రం రిలీజ్‌కి ముందే.. సేఫ్ అయిపోయింది. సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. తేజ్ కెరీర్లో ఎక్కువ ఖర్చు పెట్టి తీసిన సినిమా ఇది. దానికి తగ్గట్టే బిజినెస్ జరిగింది. ఈ సినిమాకి దాదాపు రూ.25 కోట్ల బిజినెస్ జరిగింది. హిందీ శాటిలైట్, డిజిటల్, డబ్బింగ్ రైట్స్.. ఎప్పుడో అమ్ముడుపోయాయి. అన్నీ కలిపి చూస్తే.. ఈ సినిమా ప్రొడ్యూసర్‌కు టేబుల్ ప్రాఫిట్ మిగిల్చినట్టు. సినిమా బాగా తేడా కొడితే తప్ప… నిర్మాత నష్టపోడు. తేజ్ యాక్సిడెంట్ తరవాత చేసిన తొలి సినిమా ఇదే. సుకుమార్ లక్కీ హ్యాండ్ తోడవ్వడం, యూనివర్సల్ అప్పీల్ ఉన్న సబ్జెక్ట్ ఎంచుకోవడం.. ఈ సినిమాకి కలిసొచ్చే అంశాలు. ఈ సినిమా సెన్సార్ టాక్ కూడా బాగానే ఉంది. సినిమాలో ట్విస్టులు అదిరిపోయాయని, సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ అనే టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే ఈ సమ్మర్లో మరో హిట్ పడినట్టే.