ఈ యేడాది విడుదలైన సినిమాల్లో విరూపాక్ష ప్రత్యేకంగా మిగిలిపోతుంది. ఎలాంటి అంచనాలూ లేకుండా విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకొంది. తేజ్ కెరీర్లోనే అతి పెద్ద సినిమా ఇది. సుకుమార్, కార్తీక్ దండు, బివిఎస్ఎన్ ప్రసాద్ కలిసి చేసిన ప్రాజెక్ట్ ఇది. ఇప్పుడు ఇదే కాంబోలో మరో సినిమా తయారవుతుంది. కార్తీక్ దండు దర్శకుడిగా బీవీఎస్ఎన్ ప్రసాద్ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. సుకుమార్ ఈ ప్రాజెక్టులో భాగం పంచుకొన్నారు. ఇదో మైథలాజికల్ థ్రిల్లర్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి.
అయితే హీరో ఎవరన్నది ఖరారు కాలేదు. కార్తీక్ దండు అఖిల్ తో ఓ సినిమా చేయనున్నాడని ఇది వరకు ప్రచారం జరిగింది. అయితే.. మైథలాజికల్ థ్రిల్లర్‌కి అఖిల్ `ఓకే` చెప్పకపోవొచ్చు. మరో యంగ్ హీరోతో ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్తే అవకాశం ఉంది. సుకుమర్ రైటింగ్స్ సినిమా, పైగా విరూపాక్ష టీమ్ కాబట్టి.. ఏ హీరోకి కథ చెప్పినా ఓకే అనే అవకాశాలున్నాయి. కథ పూర్తయిన తరవాతే.. హీరోని వెదుకుదాం అని సుకుమార్ చెబుతున్నాడట. సో… ప్రస్తుతానికి ఈ టీమ్ ఫోకస్ అంతా కథపైనే.