సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం విరూపాక్ష. ఈ రోజు ఈ టీజర్ విడుదల కావాల్సివుంది. కానీ… రేపటికి వాయిదా పడింది. భీమవరం సాయిధరమ్ తేజ్ అభిమాన సంఘం అధ్యక్షుడు రావూరి పండు ఈరోజు మృతి చెందారు. దానికి సంతాపం ప్రకటిస్తూ… టీజర్‌ని వాయిదా వేసింది చిత్రబృందం. ఓ అభిమానికి… మెగా హీరో ఇచ్చిన గౌరవం ఇది. సాయిధరమ్ తేజ్ తన అభిమానులతో ఎప్పుడూ టచ్‌లో ఉంటారు. రావూరి పండుతో.. తేజ్‌కి మంచి అనుబంధమే ఉంది. అందుకే… అభిమాని మృతికి నివాళిగా సినిమా టీజర్ వాయిదా వేశారు. రేపు.. ఈ టీజర్ బయటకు వస్తుంది. టీజర్‌ని ఒక రోజు ముందే పవన్ కల్యాణ్ కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. తేజ్ ఈ టీజర్ లో కొత్తగా కనిపిస్తున్నాడని, ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని పవన్ ఆకాంక్షించారు. ఏప్రిల్ 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.