బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్.. టాలీవుడ్ ప్రభాస్.. ఈ ఇద్దరి పెళ్లి వార్తలు ఎప్పుడూ హాట్ టాపిక్కే. చాలా మంది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ పెళ్లి ప్రస్థావన వస్తే ఈ ఇద్దరి పేర్లు చెప్పి తప్పించుకుంటారు. హీరో విశాల్ కూడా ఇదే మాట చెబుతున్నాడు. ప్రభాస్ పెళ్లి చేసుకున్న వెంటనే తాను కూడా వివాహ బంధంలోకి అడుగుపెడతానని అంటున్నాడు.
తన తాజా చిత్రం ‘లాఠీ’ ప్రమోషన్స్ లో బిజీగా వున్న విశాల్.. ఓ ఈవెంట్ లో పెళ్లి టాపిక్ వచ్చింది. దానికి స్పందిస్తూ.. ” పెళ్లి అనేది జోక్ కాదు. ఎన్నో బాధ్యతలతో కూడుకున్నది. పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ ప్రస్తుతానికి నా ఫోకస్ మొత్తం వర్క్‌లైఫ్ పైనే ఉంది’’ అన్నాడు. వచ్చే ఏడాది పెళ్లి చేసుకుంటారా? అని ప్రశ్నించగా..”ప్రభాస్ పెళ్లి చేసుకున్న వెంటనే తాను కూడా పెళ్లి చేసుకుంటానని సరదాగా బదులిచ్చాడు విశాల్.