పోస్టింగ్ ఆశ చూపి ఐపీఎస్ విశాల్ గున్నీతో అన్ని అడ్డగోలు పనులు చేయించారు. ఉన్నతాధికారులు చెప్పిన మాటలను తాను జవదాటలేనని అలా దాటితే.. తన పరిస్థితి ఏమవుతుదో తెలుసు కాబట్టి వారు చెప్పినట్లుగా చేశానని విశాల్ గున్నీ జెత్వానీ కేసులో అసలేం జరిగిందో మొత్తం స్టేట్ మెంట్ రూపంలో ఇచ్చేశారు. తమను సీఎంవోకు పిలిపించిన దగ్గర నుంచి జెత్వానీని , కుటుంబాన్ని అరెస్టు చేసి తీసుకు వచ్చే వరకూ ఏం జరిగిందో మొత్తం విపులంగా స్టేట్ మెంట్ ఇచ్చారు.
కుక్కల విద్యాసాగర్ ముంబైలో ఏర్పాట్లు చేశారు. అంతకు ముందు నుంచే జెత్వానీ కుటుంబంపై నిఘా పెట్టారు. ఒంగోలు లాయర్ తప్పుడు డాక్యుమెంట్ సృష్టించారు. ఇలా కథలన్నీ వెలుగులోకి వచ్చాయి. గున్నీ ఇంకా ఎస్పీ క్యాడర్ లోనే ఉన్నారు. ఆయనకు డీఐజీ పోస్టింగ్ ఆఫర్ చేసి ఈ పనంతా చేయించుకున్నారు. ఇప్పడు అసలుకే సర్వీస్ నష్టం జరుగుతూండటంతో.. గున్నీ ఎలాగైనా బయటపడాలని అనుకుంటున్నారు. అందుకే జరిగింది మొత్తం స్టేట్ మెంట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
అన్ని ఆధారాలు పక్కాగా ఉన్నాయి. ఎఫ్ఐఆర్లో ఇంకా వారి పేర్లు నమోదు చేయలేదు. సస్పెన్షన్ మాత్రమే చేశారు. ఎఫ్ఐఆర్లో కుక్కల విద్యాసాగర్ అండ్ అదర్స్ అని పెట్టారు. అదర్స్ అనే జాబితాలో ఈ ఐపీఎస్ ఆఫీసర్లను చేర్చి అరెస్టు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. తర్వాత వీరు చేసిన ఘోరాల్ని ప్రజల ముందు పెట్టి.. వీరిని శాశ్వతంగా సర్వీస్ నుంచి తొలగించేలా ప్రాసెస్ ప్రారంభించే అవకాశం ఉంది. వరసగా గత ఐదేళ్ల కాలంలో వీరు చేసిన నిర్వాకాలను బయటపెట్టనున్నాయి. వెయిటింగ్ లో ఉన్న అందరికీ అదే పరిస్థితి ఉంటుంది. కాస్త అటూ ఇటూగా అంతే అని టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.