తమిళ కథానాయకుడు విశాల్ ప్రేమ వ్యవహారం చాలా సార్లు బయటకి వచ్చింది. శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మితో విశాల్ ప్రేమలో పడ్డాడని, వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారన్న గుసగుసలు ఈవాళ ఇండ్రస్ట్రీకి కొత్త కాదు. అది శరత్‌కుమార్‌కి నచ్చకపోవడం వల్లే.. విశాల్ – శరత్ కుమార్ల మధ్య ప్రత్యన్న యుద్దం మొదలైందని, నడియార్ ఎన్నికల్లోనూ అదే కనిపించిందని, ఆ ఎన్నికల్లో వీళ్లిద్దరూ రెండు గ్రూపులుగా విడిపోయి పోటీ పడడానికి కారణం అదే అని తమిళ పరిశ్రమ వాళ్లు చెబుతుంటారు. వరలక్ష్మి ప్రస్తావన ఎప్పుడొచ్చినా విశాల్ సమాధానం దాటేసేవాడు. తను నాకు చిన్నప్పటి నుంచీ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేవాడంతే.
కానీ ఇప్పుడు విశాల్ పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చేశాడు. తమిళనాట నడియార్ సంఘం కోసం కట్టిస్తున్న కల్యాణ మండపంలో తన పెళ్లి జరుగుతుందని ఇది వరకే చెప్పాడు విశాల్. అందుకోసం తన వంతు ప్రయత్నాలు కూడా ముమ్మరం చేశాడు. ట్విట్టర్లో లేటెస్టుగా విశాల్ ఓ పిక్ పెట్టాడు. వరలక్ష్మితో క్లోజ్ గా ఉన్న ఫొటో అది. ఈ ఫోటోనే అన్నీ చెప్పేస్తుంది.. అంటూ ఓ కామెంట్ కూడా చేశాడు. అన్నీ అంటే.. ప్రేమవ్యవహారమే కదా?? దాంతో.. వీళ్ల పెళ్లికి క్లియరెన్స్ వచ్చేసిందంటూ కామెంట్లు మొదలయ్యాయి. తన ప్రేమ వ్యవహారాన్ని ఎట్టకేలకు ఇలా… బయటపెట్టాడన్నమాట. మరి శరత్ కుమార్ రియాక్షన్ ఎలా ఉందో??