హీరో మంచు విష్ణు పెద్ద వివాదంలోనే ఇరుక్కున్నాడు. ఏపీకి ప్రత్యేక హోదాపై యువత పోరుకు సిద్దం అయిన సంగతి తెలిసిందే. జల్లికట్టు ఉద్యమ స్పూర్తితో కేంద్రం మెడలు వంచేందుకు సిద్ధం కావాలని పిలుపునివ్వడంతో ఏపీలో హై టెన్షన్ కనబడుతోంది. ఏపీకి ప్రత్యేక హోదా అంశంలో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకురేపు(26) విశాఖలోని ఆర్కే బీచ్లో ఏపీ యువత మౌన నిరసన కార్యక్రమం చేపడుతున్న సంగతి తెల్సిందే. ఈ అంశంపై మాట్లాడిన విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశాడు. జల్లికట్టు ఆదర్శంగా తీసుకుని మనమందరం ప్రత్యేక హోదా వచ్చేందుకు పోరాడాలని పిలుపునిచ్చాడు. ఆ పోరాటానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని విష్ణు చెప్పాడు. అక్కడితో ఆగలేదు విష్ణు. దక్షిణాది ప్రజలు నిర్ణయిస్తేనే కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పడుతాయని, ఐనప్పటికీ సరైన గుర్తింపు ఇవ్వడం లేదని, అలాంటప్పుడు ఒకే దేశంగా ఉండాల్సిన అవసరం ఏమందని ? ఉత్తరాది, దక్షిణాది భాగాలుగా విడగొట్టడమే ఉత్తమమని సంచలన వ్యాఖ్యలు చేశాడు విష్ణు.
ఇప్పుడీ వ్యాఖ్యలు పై తీవ్ర అభ్యంతరాలు వస్తున్నాయి. భారతదేశాన్ని రెండు ముక్కలుగా విడగొట్టాలనే విష్ణు వ్యాఖ్యను తప్పుపడుతూ విష్ణు పై పోలీసులకు ఫిర్యాదు చేశారు బిజెపి ఆర్టీఐ సెల్ మెంబర్ మణిరత్నం. విష్ణు పై చాలా కఠినమైన కేసు పెట్టాలని ఆయన పోలీసులను కోరారాయన. మరి ఈ వివాదం ఎంతకు ముదురుతుందో చూడాలి.