ఐపీఎల్… క్రికెట్ లో ఇదో కొత్త ప్రభంజనం. ప్రపంచంలోని దిగ్గజ ఆటగాల్ని ఒకే వేదికపై చూపించే.. వేదిక. ఐపీఎల్ ఎంత సూపర్ సక్సెసో.. ఈ ఐపీఎల్ వల్ల ఎంత రాబడి వస్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం ఐపీఎల్ తోనే స్టార్లయినవాళ్లూ, అంతర్జాతీయ మ్యాచ్ ఆడకుండానే.. ఐపీఎల్ పేరుతో కోట్లకు పడగలెత్తిన వాళ్లు ఎందరో..? ఈ ఐపీఎల్ కి కర్త, కర్మ, క్రియ.. లలిత్ మోడీ. ఇప్పుడు అతని గురించి, అతను సృష్టించిన ఐపీఎల్ గురించీ ఓ సినిమా రాబోతోంది.
`మావిరిక్ కమీషనర్: ద ఐపీఎల్ లలిత్ మోడీ సెగ` పేరుతో బొరియా మజుందార్ అనే రచయిత ఓ పుస్తకం రాశాడు. ఇప్పుడు ఆ పుస్తకం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కుతోంది. తలైవి, 83 లాంటి చిత్రాలను అందించిన విష్ణు ఇందూరి నిర్మాతగా వ్యవహరిస్తారు. `మారివిక్ కమీషనర్` రైట్స్‌ని విష్ణు ఇందూరి దక్కించుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించే ఈ చిత్రంలో స్టార్ హీరోలు కనిపిస్తారని టాక్. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.