మంచు విష్ణు ఇంట మరోసారి పసిపాప కేరింతలు వినిపించాయి. నూతన సంవత్సరం తొలి రోజున విష్ణుకి ఓ బహుమతి అందింది. విష్ణు మరోసారి నాన్న అయ్యాడు. కొద్ది సేపటి క్రితం హైదరాబాద్లోని రైన్ బో ఆసుపత్రిలో విష్ణు శ్రీమతి విరోనిక పండంటి మగపిల్లాడికి జన్మ ఇచ్చింది. ఇప్పటికే విష్ణుకి అరియానా, వివియానా అనే ఇద్దరు పిల్లలున్నారు. ఇటీవల ట్విట్టర్లో విష్ణు చేసిన ఓ కామెంట్ ఆసక్తిని రేకెత్తించింది. విష్ణుకి ఈసారి మగ పిల్లాడు పుట్టాలని ఆయన అభిమానులు కోరుకొంటే.. దానికి బదులిచ్చారు విష్ణు. వారసత్వానికి ఆడ, మగ తేడా లేదు, మా ఇంట్లో ఇద్దరు వారసులున్నారు, మరో అమ్మాయి పుడితే.. ముచ్చటగా మూడో వారసురాలు అవుతుంది అని సమాధానం ఇచ్చారు. విష్ణు కామెంట్లు నెటిజన్లను మరీముఖ్యంగా అమ్మాయిల్ని ఆకట్టుకుంది.