పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తు పై నిన్న కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నేరుగా కొట్టి పారేయకుండా పవన్ చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం క్యాడర్ లో ఆశలు రేకెత్తిస్తే బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి మాత్రం పవన్ వ్యాఖ్యలపై మరో విధంగా స్పందించారు. వివరాల్లోకి వెళితే
పవన్ కళ్యాణ్ నిన్న ఈ అంశంపై మాట్లాడుతూ ప్రస్తుతం జనసేన బీజేపీ పొత్తు లో ఉన్నాయి అన్న అంశాన్ని గుర్తు చేస్తూనే, పొత్తు ల పై తానొక్కడినే నిర్ణయం తీసుకోలేని జనసైనికుల తో కలిసి నిర్ణయం తీసుకుంటానని వ్యాఖ్యానించారు. ఇప్పటికే బిజెపితో పొత్తు ఉన్నప్పటికీ, నిర్ణయం తీసుకోవడం గురించి మాట్లాడడం ద్వారా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తు అంశాన్ని ఓపెన్ గా ఉంచినట్లు అర్థమవుతోంది. అంతేకాకుండా జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం అవుతుంది అని , జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవాలని పలు పార్టీలు కోరుకుంటున్నాయి అని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగించాయి.
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై విష్ణువర్ధన్ రెడ్డి స్పందిస్తూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల వల్ల కొందరు ఆశలు ఆవిరయ్యాయి అంటూ పరోక్షంగా తెలుగుదేశం పార్టీ ని టార్గెట్ చేశారు. జనసేన బీజేపీ పొత్తు లో ఉన్నాయని 2024లో ఈ రెండు పార్టీలు కలిసి అధికారంలోకి ఖచ్చితంగా వస్తాయి అని వ్యాఖ్యానించిన విష్ణువర్ధన్ రెడ్డి, పరోక్షంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు తమకు అవసరం లేదని సూచించారు. విష్ణువర్ధన్ రెడ్డి మొదటి నుండి కూడా తన సామాజిక వర్గం పై ఉన్న అభిమానంతో వైయస్ రాజశేఖర రెడ్డిని ఆయన తాడు నడిపిస్తున్న వై ఎస్ ఆర్ సి పీ ని అభిమానిస్తాడని, ఆ పార్టీ బాగు కోసం సొంత పార్టీ ప్రయోజనాలను తాకట్టు పెట్టడానికి వెనుకాడరు అని ఆ మధ్య సోషల్ మీడియాలో బలంగా వాదించారు నెటిజన్లు. కేవలం వాదించడమే కాదు, గతంలో విష్ణువర్ధన్‌రెడ్డి ఫేస్ బుక్ లో రెడ్డి సామాజిక వర్గానికి అనుకూలంగా బలంగా చేసిన వ్యాఖ్యలను కూడా ఈ వాదనకు సపోర్ట్ గా తీసుకుని వచ్చారు నెటిజన్లు. ఇప్పుడు తాజాగా విష్ణువర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ తమతో కలవకూడదు అన్న ఉద్దేశంతో చేసినవే తప్పించి బిజెపి పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రావాలనే ఉద్దేశ్యంతో చేసినవి కాదని అదే నెటిజన్లు వాదిస్తున్నారు.
మొత్తం మీద విష్ణువర్ధన్ రెడ్డి మరొకసారి వైఎస్ఆర్సిపి పార్టీ పై తనకున్న అభిమానాన్ని పరోక్షంగా బయట పెట్టుకున్నారని విమర్శలు వినిపిస్తున్నా