మంచు విష్ణు తన సోదరుడు మంచు మనోజ్ పై కోర్టుకెళ్లాడు. ఎందుకంటే ఆయన మీద ఎలాంటి సోషల్ మీడియా పోస్టులు పెట్టకుండా ఆదేశించాలని సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేశాడు. పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు ఆ మేరకు ఆదేశాలు ఇచ్చింది. విష్ణుపై ఎలాంటి పరువు తక్కువ ప్రకటనలు చేయకూడదని సివిల్ కోర్టు ఉత్తర్వులు విడుదల చేసింది.
విష్ణు ఎప్పుడూ కొత్తగా ఆలోచిస్తారు. అలాగే తన సోదరుడు తనపై సోషల మీడియా పోస్టులు పెట్టకుండా కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకోవాలని తెచ్చారు. సైలెంట్ గా కోర్టుకెళ్లి ఉత్తర్వులు తెచ్చేసుకుని దాన్ని తన పీర్ టీం ద్వారా మీడియాకు లీక్ చేసుకున్నారు. ఇంతకూ సోదరుడు మాత్రమే పరువు నష్టం పోస్టులు పెడతారా? . ఇటీవల తన ఇంటి జనరేటర్లో విష్ణు చక్కెర పోశాడని ఆరోపించారు. కొన్ని వీడియోలను కూడా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో మంచు విష్ణుపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. మరోసారి ఇలాంటివి చేయకుండా ఆయన ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
మరో వైపు పంచదార ఇష్యూలో విష్ణు తప్పేమి లేదని వారి తల్లి నిర్మల పోలీసులకు కూడా లేఖ రాశారు. మంచు కుటుంబంలో ఇలాంటి వివాదాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మోహన్ బాబుకు అరెస్టు నుంచి కోర్టు రక్షణ కల్పించకపోవడంతో ఆయన ఆజ్ఞాతంలోకి వెళ్లారు. వివాదాలు పెరిగిిపోతూండంతో ఆ కుటుంబం సతమతమవుతోంది.