‘ప్రిన్స్’ తరవాత అనుదీప్ ఖాళీ అయిపోయాడు. చిరంజీవికి ఓ కథ చెప్పాడని వార్తలొచ్చాయి. ఆ తరవాత రవితేజతో సినిమా ఓకే అయ్యింది. అయితే చివరి నిమిషంలో ఈ ప్రాజెక్ట్ నుంచి రవితేజ తప్పుకొన్నాడు. దాంతో అనుదీప్ మళ్లీ ఖాళీ. రవితేజ ఎప్పుడైతే నో చెప్పాడో అప్పుడే విశ్వక్సేన్తో అనుదీప్ కమిట్ అయ్యాడని, ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రూపొందించనుందని వార్తలొచ్చాయి. ఇప్పుడు అదే నిజమైంది.
అనుదీప్ దర్శకత్వంలో విశ్వక్సేన్ కథానాయకుడిగా ఓ సినిమా చేస్తున్నట్టు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధికారికంగా ప్రకటించింది. విశ్వక్ నటించే 14వ చిత్రమిది. పూర్తిస్థాయి కుటుంబ కథా చిత్రంగా ఈ కథని మలుస్తున్నామని చిత్రబృందం ప్రకటించింది. టీజీ విశ్వ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తారు. భీమ్స్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తారు. మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తారు. విశ్వక్ ప్రస్తుతం ‘మెకానిక్ రాకీ’ సినిమాతో బిజీగా ఉన్నాడు. అక్టోబరులో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరవాతే… అనుదీప్ సినిమా సెట్స్‌పైకి వెళ్లొచ్చు.