ఎక్స్‌క్లూజీవ్‌: విశ్వ‌క్‌సేన్ తో అనుదీప్‌

‘జాతిర‌త్నాలు’తో త‌న మార్క్ చూపించాడు అనుదీప్‌. ఆ త‌ర‌వాత తాను చేసిన ‘ప్రిన్స్’ కూడా ఓకే అనిపించుకొంది. ర‌వితేజ‌తో అనుదీప్ ఓ సినిమా చేయాల్సివుంది. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించాలి. అయితే అనివార్య కార‌ణాల వ‌ల్ల ఈ సినిమా ఆగిపోయింది. దాంతో ఇప్పుడు అనుదీప్ మ‌రో హీరోని వెదుక్కొనే ప‌నిలో ప‌డ్డాడు. ఆ ప్ర‌య‌త్నాలు కూడా ఫ‌లించిన‌ట్టు స‌మాచారం. విశ్వ‌క్‌సేన్‌తో అనుదీప్ జ‌ట్టు క‌ట్ట‌బోతున్నాడ‌ని ఇన్ సైడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రాన్ని 14 రీల్స్ సంస్థ నిర్మించ‌నుంద‌ని టాక్‌. నిజానికి సితార ద‌గ్గ‌ర అనుదీప్ అడ్వాన్స్ ఉంది. హీరో మారినా, సితార‌లోనే అనుదీప్ సినిమా చేయాలి. అయితే.. అనుదీప్ మాత్రం 14 రీల్స్ కి క‌మిట్‌మెంట్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. ర‌వితేజ కోసం రాసుకొన్న క‌థ నే విశ్వ‌క్ కోసం మార్చుకొన్నాడా, లేదంటే కొత్త క‌థ రాసుకొన్నాడా? అనేది తెలియాల్సివుంది. మ‌రోవైపు చిరంజీవి కోసం కూడా అనుదీప్ ఓ స్టోరీ సిద్ధం చేస్తున్న‌ట్టు స‌మాచారం. విశ్వ‌క్ సినిమా పూర్త‌యిన త‌ర‌వాతే చిరు సినిమా ప‌ట్టాలెక్కొచ్చు. విశ్వ‌క్ ‘లైలా’ అనే చిత్రానికి ఇటీవ‌లే కొబ్బ‌రికాయ కొట్టాడు. అనుదీప్ సినిమా కూడా అతి త్వ‌ర‌లోనే క్లాప్ కొట్టుకోనుంద‌ని టాక్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నెల‌స‌రి సెల‌వులపై సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు

ఆయా కంపెనీల్లో ప‌నిచేసే మ‌హిళా ఉద్యోగుల నెల‌స‌రి సెలవుల‌ను త‌ప్ప‌నిసరి చేయాల‌న్న పిటిష‌న్ పై సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. మ‌హిళ‌ల‌కు నెల‌స‌రి సెల‌వులు మంచివే కానీ అది వారి భ‌విష్య‌త్ కు...

గుడ్ న్యూస్… ఏపీలో ఫ్రీగా ఇసుక‌-జీవో జారీ

ఏపీ ప్ర‌జ‌ల‌కు స‌ర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 2019, 2021 సంవ‌త్స‌రాల్లో ఇచ్చిన ఇసుక పాల‌సీల‌ను ర‌ద్దు చేస్తూ స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకుంది. అయితే, క‌లెక్ట‌ర్ల‌కు ప్ర‌త్యేకంగా విధివిధానాలు 2024వ‌రకు అందుబాటులో...

రాజకీయాలకు కొడాలి నాని గుడ్ బై!?

వైసీపీ ఓటమి తర్వాత ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నేతలు బయటకు వచ్చేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. అక్కడక్కడ ఒకరిద్దరూ మినహా మిగతా నేతలు పెద్దగా కనిపించడం లేదు.ముఖ్యంగా కొడాలి నాని...

నామినేటెడ్ పోస్టుల పంపకాలపై లోకేష్ కసరత్తు

ప్రభుత్వం ఏర్పడింది. ఐదేళ్లుగా కష్టపడిన నేతలకు పదవులు ఇచ్చేందుకు టీడీపీ నాయకత్వం సిద్ధమయింది. అభిప్రాయ సేకరణ కూడా జరుపుతోంది. మరో నెలలో కీలక పోస్టులను భర్తీ చేసే అవకాశం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close