విశ్వక్ సేన్ మైక్ పట్టుకున్న ప్రతిసారి వైరల్ కంటెంట్ ఇస్తాడు. సెన్సార్ లేకుండా తను చేసే కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. మొన్న వరంగల్ లో జరిగిన మొకానిక్ రాకీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో తన మైకు రివ్యూవర్స్ వైపు తిరిగింది. వీపులు పగిలిపొతాయని ఓ వార్నింగ్ ఇచ్చాడు.
నిజానికి విశ్వక్ రివ్యూవర్స్ ని టార్గెట్ చేసే సమయం కాదిది. మరి ఎందుకు అంత తీవ్రంగా మాట్లాడాల్సి వచ్చింది? ఈ ప్రశ్నకు విశ్వక్ సమాధానం ఇచ్చాడు. ”నేను కూల్ గానే మాట్లాడాను. అది కూడా మొక్కు మొహం చూపించకుండా అజ్ఞాతంలో ఉంటూ పర్శనల్ ఎటాక్ చేస్తున్న వారి గురించే అలా మాట్లాడాను. ఏ ఒక్క సంస్థ, వ్యక్తిని ఉద్దేశించి ఆ వాఖ్యలు చేయలేదు’ అని చెప్పుకొచ్చాడు విశ్వక్.
నిజమే.. కొంతమంది రివ్యూలు ఇచ్చేవారు ఒక సంస్థ, పేరు, ఊరు లేకుండా మాస్కులు ధరించి, వాయిస్ ఓవర్ లతో రివ్యూలు ఇస్తున్నారు. నకిలీ పేర్లతో హ్యండిల్స్ నిర్వహిస్తున్నారు. వాళ్ళ గురించే తన వాఖ్యలని చెప్పాడు విశ్వక్. కాకపొతే ఈ చెప్పేదేమో ఆ రోజు వేదికపైనే క్లారిటీ చెప్పేసుంటే ఏ గొడవ వుండేది కాదు. ఏదేమైనా తన మిస్ కమ్యునికేషన్ ని దిద్దుకోవడం మంచిదే.