విశ్వక్ సేన్ ఏది చేసిన అందులో కొంత వెరైటీ వుంటుంది. ఆయన కెరీర్ చేసుకుంటే అన్ని రకాల సినిమాలు కనిపిస్తాయి. ఇప్పుడు ఆయన ఖాతాలో మరో వెరైటీ చేరింది. లైలా అనే ఓ కామెడీ సినిమా చేస్తున్నారు విశ్వక్. ఈ సినిమాలో సెకండ్ హాఫ్ అంతా అమ్మాయిగా కనిపిస్తారట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పారు. ఇదొక డిఫరెంట్ స్క్రిప్ట్. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే ఆసక్తి వుందని చెప్పుకొచ్చారాయన.
విశ్వక్ నటించిన గామి సినిమా మార్చి 8న వస్తోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం మొదలైన సినిమా ఇది. ఈ సినిమా కోసం కూడా కొన్ని ఆసక్తికరమైన సంగతులు చెప్పారు. ఈ కథ విన్నప్పుడే ఇదొక వంద కోట్ల బడ్జెట్ సినిమా అవుతుందని, ఐదేళ్ళకు పైగా పడుతుందని భావించారట. మొత్తానికి ఆయన అనుకున్నట్లే ఐదేళ్ళు పట్టేసింది. మరి బడ్జెట్ ఎంత అయిందని అడిగితే.. ‘విడుదల తర్వాత చెప్తా’ అని నవ్వేశారు.