‘లైలా’ రిజల్ట్ తో డీలా పడ్డాడు విశ్వక్ సేన్. ఎంతో ముచ్చటపడి చేసిన లేడి గెటప్ దారుణంగా దెబ్బకొట్టింది. కనీసం లేడి గెటప్ అయినా ఎదోలా సినిమాని బయటపడేస్తుందని ఆశపెట్టుకున్నాడు. కానీ విశ్వక్ కలలో కూడా ఊహించని రియాక్షన్ ఆడియన్స్ నుంచి వచ్చింది.
అయితే విశ్వక్ లైనప్ ఇప్పుడు స్ట్రాంగ్ గా వుంది. విశ్వక్ సేన్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలున్నాయి. అనుదీప్ సినిమా ఫంకీ రన్నింగ్ లో ఉంది. ఇందులో హీరోయిన్ గా కృతి శెట్టిని అనుకుంటున్నారు. అలాగే సాగర్ చంద్ర దర్శకత్వంలో ‘జిత్తూ పటేల్’ అనే సినిమా ఓకే చేశాడు. దీనికి నిర్మాత ఫిక్స్ కావాల్సివుంది. దీంతో పాటు ఇటీవల ఓ హారర్ సినిమా తీసి హిట్టు కొట్టిన ఓ దర్శకుడి కథని దాదాపు ఓకే చేశాడు విశ్వక్. దీనికి సంబంధించిన వివరాలు త్వరలో బయటకు రానున్నాయి.
ఫంకీ, ‘జిత్తూ పటేల్’ ఈ రెండు కూడా క్రేజీ ప్రాజెక్ట్ లే. పైగా ఆ సినిమా దర్శకులకి మంచి ట్రాక్ రికార్డ్ వుంది. అనుదీప్ జాతిరత్నాలు లాంటి న్యూ ఏజ్ కామెడీ ఎంటర్ టైనర్ తీశాడు. భీమ్లా నాయక్ తో ఆకట్టుకున్నాడు సాగర్ చంద్ర. విశ్వక్ బౌన్స్ బ్యాక్ అవ్వడానికి ఒక్క హిట్ చాలు. అలాంటి ఓ మాంచి హిట్ ఈ ప్రాజెక్ట్స్ నుంచి వచ్చే అవకాశాలు పుష్కలంగా వున్నాయి.