విశ్వక్సేన్ ‘లైలా’ సినిమా 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో 30 ఇయర్స్ పృథ్వీరాజ్ చేసిన కామెంట్స్ రాజకీయంగా చర్చనీయాంశమైంది. తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ విశేషాలు చెబుతూ 150 మేకల్లో చివరకు 11 మిగిలాయని ఆయన చెప్పడం వైసీపీకి తగిలింది. దీంతో సినిమాని బాయ్‌కాట్ చేయాలంటూ వైసీపీ వర్గాలు సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా పోస్ట్ లు పెట్టారు ఈ నేపథ్యంలో విశ్వక్ ప్రెస్ మీట్ పెట్టారు.
‘‘సోషల్ మీడియాలో ‘లైలా’ బాయ్‌కాట్ ట్రెండ్ చూసి షాకయ్యా. ఒక రాత్రిలో 23 వేల పోస్టలు వచ్చాయి. హెచ్డీ ప్రింట్ ఆన్ లైన్ లో పెడతామని బెదిరున్నారు. నిజానికి ఆ వ్యక్తి(పృథ్వీరాజ్ ) మాట్లాడే సమయంలో నేను, నిర్మాత అక్కడలేం. చిరంజీవిని లోపలికి తీసుకొచ్చేందుకు వెళ్లాం. అది మాకు తెలియకుండా జరిగింది. ఏది ఏమైనా సినిమా ఒకరిద్దరి కాదు. వేల మంది కష్టపడి పనిచేస్తేనే అవుట్‌పుట్ వస్తుంది. ఒకరు చేసిన తప్పుకి అందరినీ బలి చేయద్దు. నా సినిమాని ఎలాంటి ఆటంకాలు లేకుండా విడుదల కావాలని కోరుకుంటున్నాను. ఈ విషయంలో ఎవరి మనోభాబాలు దెబ్బతిన్నట్లతే బేషరతుగా క్షమాపణలు చెబుతున్నాను’ అని వివరణ ఇచ్చారు విశ్వక్