దీపావళిపై సహజంగానే టాలీవుడ్ గురి వుండదు. ఈ పండక్కి తెలుగు సినిమాలు అంత ఆసక్తి చూపించవు. తమిళ డబ్బింగ్ బొమ్మల జోరే గట్టిగా వుంటుంది. ఈ దీపావళి కూడా అదే సెంటిమెంట్ కొనసాగేలా కనిపిస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ 31 దీపావళి. గురువారం వస్తోంది. అంటే లాంగ్ వీకెండ్. ఇప్పటివరకూ ఈ డేట్ ని అనౌన్స్ చేసుకున్న సినిమాలు రెండే కనిపిస్తున్నాయి.
తమిళ్ నుంచి శివకార్తికేయన్ అమరన్ అక్టోబర్ 31ని లాక్ చేసుకుంది. కమల్ హసన్ ఈ సినిమాకి నిర్మాత. కాశ్మీర్ నేపధ్యంలో సాగే ఈ సినిమాకి రాజ్ కుమార్ పెరియస్వామీ డైరెక్టర్.
Read More : ప్రభాస్ వచ్చేశాడు… వాట్ నెక్ట్స్?
ఇక తెలుగు విషయానికి వస్తే.. విశ్వక్ సేన్ మెకానిక్ రాకీని ఇదే డేట్ కి అనౌన్స్ చేశారు. రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. దీపావళి టాలీవుడ్ కి సెంటిమెంట్ కానప్పటికీ లాంగ్ వీకెండ్ ద్రుష్టిలో పెట్టుకొని ఈ డేట్ ని లాక్ చేశారు. తెలుగులో ఇదొక్క సినిమానే కనిపిస్తోంది. సెంటిమెంట్ పక్కన పెడితే లాంగ్ వీకెండ్ లో సోలో రిలీజ్ అంటే అడ్వాంటేజ్ వుంటుందనే చెప్పాలి.