విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ఇప్పటికే రావాల్సింది. కొన్ని అనుకోని కారణాల వలన సినిమా వాయిదా పడింది. ఈ సినిమా మార్చిలో అనుకున్నారు. అయితే మార్చిలో కూడా ఈ సినిమా రావడం లేదు. దీనికి బదులు విశ్వక్ సేన్ గామి వస్తోంది. ఐదేళ్ళ క్రితం మొదలుపెట్టిన ప్రాజెక్ట్ ఇది. ఇప్పుడు మోక్షం దొరికింది. మార్చి 8న విడుదల చేస్తున్నారు. ఫలక్ నామా దాస్ విడుదల కాకముందు మొదలుపెట్టిన సినిమా ఇది. ఇప్పుడు విశ్వక్ కి మార్కెట్ వచ్చింది. అది ఈ సినిమాకి ప్లస్. అలాగే హిమాలయాలు, కుంభామేళలో సినిమాని షూట్ చేశారు. ఇందులో అఘోర పాత్రలో కనిపిస్తున్నాడు విశ్వక్. కంటెంట్ వరకు రొటీన్ కి భిన్నంగా వుంది. ప్రస్తుతం యూనిక్ కంటెంట్ ని ప్రేక్షకులకు ఇష్టపడుతున్నారు. ఆ విధంగా చూస్తే గామి చుట్టూ పాజిటివ్ వైబ్ వుంది. మార్చి 8 అంటే సరిగ్గా పరీక్షల సమయం. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వెనకడుగు వేయడానికి కారణం కూడా ఇదే. మరి గామి రిజల్ట్ ఎలా వుంటుందో చూడాలి.