హీరో అమ్మాయిలా మారిపోయే సినిమాలు వచ్చి చాలా కాలమైయింది. ఇప్పుడు విశ్వక్ సేన్ అలాంటి కథతో వస్తున్నాడు. అదే లైలా. ఈ సినిమా టీజర్ ని వదిలారు. ఇందులో సోను అనే అబ్బాయి, లైలా అనే అమ్మాయి.. ఇలా రెండు గెటప్స్ లో కనిపిస్తున్నాడు విశ్వక్.
సోను కి హైదరాబాద్ ఓల్డ్ సిటీలో బ్యూటీ పార్లర్ వుంటుంది. తను అమ్మాయిలకి మేకప్ వేయడంలో పాపులర్. అంతేకాదు.. అవసరమైతే గొడవలకి దిగి యాక్షన్ కూడా చేస్తాడు. అలాంటి సోను అనుకోని పరిస్థితులలో అమ్మాయిగా మారిపోతాడు. ఈ మార్పుకి కారణం ఏమిటి ? తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేది మిగతా కథ.
లైలా క్యారెక్టర్ తప్పితే పూర్తిగా విశ్వక్ మార్క్ సినిమా ఇది. లైలా పాత్ర చుట్టూనే ఎదో కొత్తదనం వుంది. టీజర్ లో విశ్వక్ మార్క్ డైలాగ్, మేనరిజం వున్నాయి. లైలాగా కనిపించిన తీరు బాగానే కుదిరింది. దర్శకుడు రామ్ నారాయణ్ ఎదో కొత్త పాయింట్ తో కథని అల్లినట్లే అనిపిస్తోంది. మ్యూజిక్, కెమరా పనితనం డీసెంట్ గా వున్నాయి. టీజర్ సినిమాపై ఆసక్తిని కలిగించేలానే వుంది. విశ్వక్ మంచి కమర్షియల్ సక్సెస్ కావాలి ఇప్పుడు. ఆ సక్సెస్ లైలాతో వస్తుందో చూడాలి. ఫెబ్రవరి 14న సినిమా విడుదల కానుంది.