కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గురించి సాహితీ ప్రపంచానికి పరిచయం చేయాల్సిన పనిలేదు. జ్ఞానపీఠ్ అందుకున్న మహా కవి ఆయన. వేయి పడగలు, రామాయణ కల్పవృక్షము… ఆయన సృష్టించిన అద్భుతాలే. ఇప్పుడు ఈ మహాకవి చరిత్ర…. దృశ్యరూపంలో రాబోతోంది. నటుడు, రచయిత, దర్శకుడు ఎల్బీ శ్రీరాం… ఈ బాధ్యతని తన భుజాలపై వేసుకున్నారు. విశ్వనాథ పాత్రని ఆయనే పోషిస్తూ.. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఓ ఓటీటీ సంస్థ కోసం… ఈ సినిమాని రూపొందిస్తున్నారు. షూటింగ్ కూడా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. విశ్వనాథ జీవిత చరిత్ర..లో కమర్షియల్ అంశాలేం ఉండకపోవొచ్చు. కానీ ఓ కవి జీవితాన్ని డాక్యుమెంటరీ చేయాల్సిన అవసరం, బాధ్యత… ఈ తరానికి ఉంది. ఆ బాధ్యతని.. ఎల్బీ శ్రీరామ్ తీసుకున్నారు. ఇలాంటి ప్రయత్నాలు విజయవంతమైతే… మరికొంతమంది సుప్రసిద్ధ రచయితలు, నవలాకారులు, సాహితీ వేత్తల జీవితాల్ని దృశ్యరూపంలో తీసుకొచ్చే అవకాశం ఉంది.