యువ హీరో సందీప్ కిషన్ ఇటీవలే నిర్మాతగా మారాడు. ఇప్పుడు హాస్య నటుడు సత్యని హీరోగా చేస్తూ… `వివాహ భోజనంబు` అనే సినిమా కూడా తీసేశాడు. సందీప్ కిషన్ ఫుడ్ బిజెనెస్‌లో కూడా ఉన్న సంగతి తెలిసిందే. తన హోటెల్ పేరు… `వివాహ భోజనం`.. ఇప్పుడు ఆ పేరు సినిమా టైటిల్ గానూ వాడేసుకున్నాడు. టీజర్ ఈరోజే విడుదలైంది.
ఓ పిసినారి పెళ్లి కథ ఇది. లాక్ డౌన్లో… 30 మంది బంధువుల సమక్షంలో పెళ్లి చేసుకుంటే, వాళ్లంతా.. తన ఇంట్లోనే ఉండిపోవాల్సివస్తే ఎలా ఉంటుందన్నది కథ. సత్య కామెడీ టైమింగ్, పెళ్లి హంగామా, పిసినారి కథ, లాక్ డౌన్ గోల… ఇవన్నీ కలగలిపి దీన్నో ఎంటర్టైనర్గా మార్చేశారనిపిస్తోంది. రామ్ అబ్బరాజు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. నిర్మాత సందీప్ కిషన్ గెస్ట్ అప్పీరియన్స్ కూడా ఉంది ఇందులో. మరి నిర్మాతగా సందీప్‌కి ఈసినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.