దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ చెత్త సినిమా అంటూ నటుడు ప్రకాశ్‌రాజ్ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ‘‘ది కశ్మీర్ ఫైల్స్’ ఒక చెత్త సినిమా. ఇంటర్నేషనల్ జ్యూరీ కూడా ఈ చిత్రాన్ని చెత్త సినిమాగా తీర్మానించింది. ఇంత జరిగినా వాళ్లకు ఇంకా సిగ్గురాలేదు. ఆ చిత్ర దర్శకుడు ‘‘నాకు ఎందుకు ఆస్కార్ రాలేదు?’’ అని మాట్లాడుతున్నాడు. అతడికి ఆస్కార్ కాదు కదా.. భాస్కర్ కూడా రాదు. ఇలాంటి ప్రచార చిత్రాలు తీయడానికి కొంతమంది రూ.2000 కోట్లు పెట్టుబడి పెడుతున్నారని నాకు తెలిసిన వాళ్లు చెప్పారు’’ అంటూ సంచలన ఆరోపణలు చేశారు ప్రకాష్ రాజ్.
కాగా ఈ వ్యాఖ్యలపై వివేక్ అగ్నిహోత్రి కౌంటర్ ఇచ్చారు. ఒక చిన్న, జనం సినిమా కాశ్మీర్ ఫైల్స్ అర్బన్ నక్సల్ కి నిద్రలేని రాత్రులను ఇచ్చింది. ఏడాది గడుస్తున్నా ఇంకా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వాళ్ళనే మొరిగే కుక్కలు అని పిలుస్తారు మిస్టర్ ఆంధకార్ రాజ్’’ అంటూ ట్వీట్ చేశారు వివేక్. కశ్మీర్ పండిట్స్పై జరిగిన ఆకృత్యాల నేపథ్యంలో వివేక్ అగ్నిహోత్రి ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో అంతటి వివాదం కూడా అయింది.