వివేకా హత్య కేసును దర్యాప్తు చేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని.. సిద్దంగానే ఉన్నామని సీబీఐ .. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు తెలియచేయడం చర్చనీయాంశమవుతోంది. మాజీ ఎంపీ, మాజీ మంత్రి అయిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏపీ పోలీసులు సరిగ్గా దర్యాప్తు చేయడం లేదని.. సీబీఐకి ఇవ్వాలని కోరుతూ.. వైఎస్ జగన్, వైఎస్ వివేకా, ఎమ్మెల్సీ టెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. అయితే ప్రతిపక్ష నేతగా జగన్ ఆ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండటంతో.. ఆ పిటిషన్పై ఉత్తర్వులు వద్దని మరో అఫిడవిట్ ఇచ్చారు. దాంతో ఆయన సీబీఐ విచారణ కోరడం లేదని స్పష్టమవుతోంది. మిగతా అందరూ మాత్రం.. వివేకా హత్య కేసులో ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తూ… ప్రభుత్వం తీరుపైనే సందేహం వ్యక్తం చేస్తూ.. సీబీఐ విచారణ గట్టిగా అడిగారు.
ఈ విషయంపై సీబీఐ అభిప్రాయాన్ని హైకోర్టు అడిగింది. తాము విచారణ చేపట్టడానికి సిద్ధంగానే ఉన్నామని సీబీఐ తెలిపింది. అయితే.. ప్రభుత్వం తరపున అభిప్రాయం చెప్పడానికి మాత్రం.. అడ్వొకేట్ జనరల్ సిద్దంగా లేరు. అప్పటి వరకూ ప్రభుత్వం తరపున పలు కేసుల్లో వాదించిన ఏజీ.. ఈ కేసు విచారణకు మాత్రం కోర్టు హాల్లోకి రాలేదు. ఈ కేసులో గతంలో పలుమార్లు తన దగ్గర పూర్తి వివరాలు లేవని.. వాయిదా కోరిన ఏజీ.. నిన్న అసలు కోర్టుకే హాజరు కాలేదు. దాంతో.. కేసును విచారణ ఈ నెల 20కి హైకోర్టు వాయిదా వేసింది. సీబీఐ విచారణ కావాలంటే… ఒక సమస్య.. వద్దు అంటే మరో సమస్య వచ్చి పడుతుంది. అందుకే… వీలైనంత వరకూ.. వాయిదాలతో గడిపేయాలన్న ఆలోచన… ప్రభుత్వం చేస్తోందంటున్నారు. ఈ పరిణామం… ప్రభుత్వం తీరుపై మరిన్ని అనుమానాలు రేకెత్తిస్తోందన్న అభిప్రాయం కలుగుతోంది.
హైదరాబాద్ సీబీఐ జాయింట్ డైరక్టర్గా.. గుజరాత్ క్యాడర్ ఐపీఎస్ అధికారి మనోజ్ శశిధరన్ను నియమించారు. ఆయన వచ్చిన తర్వాత పరిస్థితులు మారుతాయేమోనని.. జగన్ అండ్ కో ఆశలు పెట్టుకుంది. కానీ అనూహ్యంగా.. హైకోర్టులో… వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ..సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఇప్పుడు వివేకా హత్య కేసును విచారణ చేయడానికి కూడా అంగీకారం తెలిపింది.