వైఎస్ వివేకానందరెడ్డిని దారుణంగా హత్య చేసి ఐదేళ్లు అయింది. సొంత అన్న కుమారుడు సీఎంగా ఉండి ఇంత వరకూ న్యాయం చేయలేకపోగా… బాబాయ్ కుమార్తె, అల్లుడే హత్య చేశారని నమ్మించి జైలుకు పంపించే ప్రయత్నం చేశారు. దీంతో వారు హైకోర్టు కు వెళ్లాల్సి వచ్చింది. పొరపాటున హైకోర్టు సీబీఐకి ఇవ్వకుండా ఉండి ఉంటే ఈ పాటికి తండ్రిని హత్య చేశారని సొల్లు కథలుచెప్పి సునీతను, ఆయన భర్తను జైల్లో పెట్టేసి ఉండేవాళ్లు.
జగన్ .. క్రూర మనస్థత్వాన్ని చాలా వేగంగా అర్థం చేసుకున్నారో.. లేకపోతే.. న్యాయం కోసం పోరాటంలో యాధృచ్చికంగా దూరమయ్యారో కానీ సునీత.. బయట పడటంతో .. బయటపడ్డారు. లేకపోతే ఈ పాటికి ఆమె తండ్రి కన్నా ఘోరమైన మానసిక హింస ఎదుర్కొంటూ ఉండేవారు . ఇప్పుడు న్యాయం కోసం ఆమె చేస్తున్న పోరాటంలో తక్కువ హింస ఏమీ పడటం లేదు. ఇప్పుడు ప్రజా మద్దతు కోసం వస్తున్నారు. హంతకుల్ని రక్షిస్తున్న వారిని శిక్షించమని కోరుతూ.. ముందుకు వస్తున్నారు.
కడపలో ఈ రోజు వైఎస్ వివేకా కుటుంబం ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి వారికి మద్దతుగా ఉన్న కుటుంబసభ్యులు, ఇతరులు హాజరు కానున్నారు. ప్రజా తీర్పు కావాలని.. ప్రజా మద్దతు కావాలని .. వివేకా భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత కోరుతున్నారు. వారు ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై .. స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. సౌభాగ్యమ్మ టీడీపీ తరపున లేదా ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.