విశాఖలో బీచ్ శాండ్ తవ్వుకోవడానికి హడావుడిగా ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఇక్కడ బీచ్ శాండ్ తవ్వుకోవాలంటే కేంద్రం అనుమతి తప్పనిసరి. ఎందుకంటే.. అక్కడ శాండ్‌లో మోనోజైట్ ఉంటుంది. అణు బాంబుల తయారీలోనూ.. అణు విద్యుత్ ఉత్పత్తిలోనూ వినియోగిస్తారు. దీని కోసమే బీచ్ శాండ్ తవ్వకాలకు అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తోంది.
నిజానికి ఇప్పటికే అక్రమంగా తవ్వి తీసి.. విదేశాలకు ఎగుమతి చేస్తున్నారని కేంద్రం గతంలో గుర్తించింది. అత్యంత ఖరీదైన .. అరుదైన ఖనిజం. అక్రమంగా .. నిబంధనలకు విరుద్ధంగా విదేశాలకు ఏపీ నుంచి తరలించారని కేంద్రం నిర్ధారించింది. దీనిపై విచారణకు ఆదేశించినట్లుగా కూడా కేంద్రం పార్లమెంంట్లో చెప్పింది. అంటే.. తప్పు జరిగిపోయింది.. కానీ కేంద్రం తర్వాత ఏ చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు అధికారికంగా బీచ్ శాండ్ పేరుతో మోనోజైట్ తవ్వుకోవడానికి అనుమతులుఇచ్చేస్తున్నారు.
ఏపీలో గత నాలుగున్నరేళ్ల కాలంలో కొండలు.. గుట్టలు కొల్లగొట్టేస్తున్నారు. ఈ దోపిడీలో.. బీచ్ శాండ్ మినరల్స్ దోపిడి అధికారవర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. మోనజైట్ కొనుగోలు చేసేది ఎవరు ? ఏపీ నుంచి అక్రమంగా ఎగుమతి చేసిన బీచ్ శాండ్ మినరల్స్ ను ఎవరు కొనుగోలు చేస్తారు.. అణు అవసరాలు ఉన్న వారే కొనుగోలు చేస్తారు. అందులో చాలా దేశాలు చాలా చట్టబద్ధంగా వ్యవహరిస్తాయి. అధికారికంగా వచ్చే అణు వనరులను మాత్రమే కొనుగోలు చేస్తాయి. కానీ ఏపీ నుంచి అక్రమంగా ఎగుమతి అయ్యాయని కేంద్రం చెబుతున్న అణు మినరల్స్ ఏ దేశానికి చేరాయో ఇంత వరకూ తేల్చలేదు.
బీచ్ శాండ్ మినరల్స్.. అదీ కూడా మోనజైట్ అక్రమ ఎగుమతులు ఓ రకంగా దేశద్రోహం కిందకే వస్తుంది. ఎందుకంటే వీటి విషయంలో దేశ ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి. అందుకే ప్రత్యేకమైన నిబఁధనలు ఏర్పాటుచేశారు. అయితే ఏపీ ప్రభుత్వం చాలా కాలంగా ఈ మైనింగ్‌కు అనుమతి ఇవ్వాలని కోరుతోంది. అనుమతి ఇవ్వకుండానే తవ్వేసి సీక్రెట్‌గా కొంత మంది పంపేస్తున్నారు. దీన్ని కేంద్రం నిర్ధారించింది. ఇప్పుడు అధికారికంగా అనుమతులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడే స్కాంను దాచి పెట్టాలన్న కుట్ర కనిపిస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి.