బాల్కనీ నుంచి చూస్తే కనుచూపు మేరలో కనిపించే సముద్రం, సముద్రం నుంచి వచ్చే పిల్లగాలులు, ఇంట్లో ప్రైవేటు పూల్స్ నుంచి అంతా లగ్జరీ ఏర్పాట్లు ఉంటే.. అంత కంటే కావాల్సింది ఏముంటుంది. మిగతా అన్నీ ఉన్నా.. సముద్రం ఉండే సిటీలు మాత్రం పరిమితంగా ఉంటాయి. అలా ఉన్న వాటిలో ది బెస్ట్ వైజాగ్. అందుకే విశాఖలో బీచ్ విల్లాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.
ప్రస్తుతం విశాఖపట్నం లో అత్యంత లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టులలో లా సిటాడెల్ విల్లాస్ మొదటి స్థానంలో ఉంటుంది. ఈ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్టు అత్యంత లగ్జరీగా ఉంటుంది. విశాలమైన లేఅవుట్లు, పెద్ద బాల్కనీలు, ఫ్లోర్-టు-సీలింగ్ విండోస్‌తో ప్రత్యేకంగా ఉంటాయి.ఇదే కాదు ఇంకా చాలా ఖరీదైన విల్లా ప్రాజెక్టులు వరుసగా ఉన్నాయి. ఎమార్ బౌల్డర్ హిల్స్, ఎంకే వన్, సంకల్ప్ వెస్ట్ విండ్స్ వంటి కంపెనీలు ప్రాజెక్టుల్ని సిద్దం చేశాయి. ఇవన్నీ పాతవే కావడంతో ఏమైనా ఉంటే రీసేల్ ఇళ్లు మాత్రమే ఉంటాయని రియల్ ఎస్టేట్ వర్గాలుచెబుతున్నాయి.
ఈ ప్రాజెక్టులన్నీ రుషికొండకు సమీపంలోనే ఉంటాయి. విశాలమైన లేఅవుట్లు, ఆధునిక ఆర్కిటెక్చర్, ప్రీమియం ఫినిషింగ్‌లు, అధునాతన భద్రత ఉంటాయి. సముద్రతీర లగ్జరీ జీవనశైలిని కోరుకునే వారికి బాగా నచ్చుతాయి. ఇన్ని లగ్జరీలు ఉన్నవి సామాన్యులకు అందుబాటులో ఉండే అవకాశం లేదు. కుబేరులకు మాత్రమే అవి.