పోర్టులో డ్రగ్స్ తో ఓ కంటెయినర్ పట్టుబడింది. ఈ కంటెయినర్ ను తప్పించడానికి విశాఖ పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. పోర్టులోకి వెళ్లి మరీ సీబీఐ అధికారులను అడ్డుకునేంత పని చేశారు. సాధారణంగా సీబీఐ అధికారులు దర్యాప్తు చేసే కేసుల్లోకి అనుమతి ఉంటే తప్ప .. రాష్ట్ర పోలీసులు ఎంటర్ అవ్వకూడదు. ఇక్కడ ఉన్నత స్థాయి అధికారులు రంగంలోకి దిగారు. కమిషనర్, ఐజీ స్థాయి అధికారులే ఈ పని చేసినట్లుగా తెలుస్తోంది. సీబీఐ అధికారులు స్వయంగా ఎఫ్ఐఆర్ లో ఏపీ అధికారులు అడ్డుకున్నారని చెప్పడంతోనే సంచలనంగా మారింది.
విశాఖ అధికారులకు.. పై స్థాయి నుంచి ఆ కంటెయినర్ ను ఎలాగైనా తప్పించాలన్న ఆదేశాలు వచ్చి ఉంటాయని అందుకే వారు ఇన్వాల్వ్ అయినట్లుగా అనుమానిస్తున్నారు. వీరిపై సీబీఐ గు రి పెట్టే అవకాశం ఉంది. డ్రగ్స్ కంటెయినర్ కు సంబంధించిన వ్యక్తులే ఉన్నతాధికారుల్ని పురమాయించి ఉంటారని సులువుగా అర్థం చేసుకోవచ్చు. వారెవరు అన్నది.. ఈ పోలీసు ఉన్నతాధికారుల ద్వారా సీబీఐ అధికారులు తెలుసుకునే అవకాశం ఉంది.
ఏపీలో పోలీసులు కొన్నాళ్లుగా ఎన్ని రకాల విమర్శలను ఎదుర్కొంటున్నారో చెప్పాల్సిన పని లేదు. రాజకీయ పోలీసింగ్ చేసి..ప్రతిపక్షాలను వేధించారు. హత్యలు జరుగుతున్నా పట్టించుకోలేదు. లా అండ్ ఆర్డర్ అంటే.. వైసీపీ వాళ్లు నేరాలు చేస్తూ ఉంటే చూడటం… ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం అన్నట్లు గా సాగుతోంది. చివరికి డ్రగ్స్ మాఫియా కోసం… కోసం కూడా సీబీఐతో వాదులాటకు దిగాల్సిన దుస్థితికి దిగజారిపోయారు.