విశాఖలో వైసీపీ వ్యవహారాలు లెక్కకు మిక్కిలిగా వెలుగులోకి వస్తున్నాయి. విశాఖ నగరం అంటే గుర్తొచ్చే పెద్దజాలరిపేట రాష్ట్రంలోనే అతిపెద్ద అవినీతి కుంభకోణానికి చిరునామాగా మారుతోందని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. జాలరిపేట వంద ఏళ్లుగా నివాసం ఉంటున్న స్థానిక మత్స్య కారులది కాదని అది తమదని కొందరు తెరపైకి వచ్చారు. జాలరి పేటపై భూ హక్కులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి ప్రతిఫలం గా 2800 కోట్ల రూపాయలు విలువ చేసే టిడిఆర్ బాండ్ లు పొందేందుకు ఆఘమేఘాల మీద ఫైళ్లు కదులుతున్నాయి.
పెదజాలరిపేట పై హుక్కు లు 1921 వసంవత్సరంలో రాణి సాహిబా వాద్వాన్ కు ఉన్నాయి అంటూ ఒక చిన్న కాగితాన్ని తీసుకొచ్చి వేల కోట్లు కొట్టేసేందుకు అధికారులు ద్వారా పావులు కలిపారు. విశాఖ ఆర్ డీ ఓ హుస్సేన్ సాహెబ్ నేతృత్వంలోని పదుల సంఖ్యలో అధికారులు ఇదే పనిలో ఉన్నారన్నారు. జాలరి పేట మత్స్య కారులను ప్రభుత్వ పధకాల పేరిట మభ్యపెట్టి పది మంది వీఆర్వో లతో డాక్యుమెంట్లను సేకరించి ఇప్పటికే సర్వే పూర్తి చేశారు.
గతంలో జైలుకు వెళ్లి వచ్చిన కొందరు ఉన్నతాధికారుల సహకారంతో వేల కోట్లను కొట్టేసేందుకు రంగం సిద్ధం చేశారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పెదజాలరిపేట భూమి రాణి వారసులకు పేరిట క్లైమ్ చేయించి భారీ కుంభకోణానికి తెర లేపారని సులువుగానే అర్థమవుతుంది. ఇప్పటికే చివరి దశలో ప్రక్రియ ఉన్నట్లుగా అనుమానాలు ఉన్నాయి. విజయసాయిరెడ్డి ప్రమేయంతో ,ఒత్తిడితో ఆగమేఘాల మీద ఫైళ్లు కదులుతున్నాయని జనసేన చెబుతోంది.
అదంతా ప్రభుత్వ స్థలం. మత్య్యకారులకు ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు తాము ఇచ్చినదే తప్పు అని ఇతరులుక టీడీఆర్ బాండ్లు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ప్రజాధనాన్ని ఇష్టం వచ్చినట్లుగా దోచుకోవడానికి అలవాటు పడిన వారు వేల కోట్లు ఇలా కాజేస్తూండటం సంచలనంగా మారుతోంది. ఇప్పటికే ఎన్నో టీడీఆర్ బాండ్ల అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.