విశాఖలో రియల్ ఎస్టేట్ లావాదేవీలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. గతంలో రాజధాని అని ప్రచారం చేసినా కొంత మంది బడావ్యక్తులే లావాదేవీలు నర్వహించేవారు. కానీ ఇప్పుడు నివాసానికి అనుకులంగా … అక్కడ స్థిరపడాలనుకునే మధ్యతరగతి ప్రజలు ఎక్కువ మంది విశాఖలో మంచి ఇళ్ల కోసం ఎంక్వయిరీలు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో కోటి రూపాయల వరకూ పెట్టి ఇళ్లు కొనుక్కునేందుకు ముందుకు వచ్చే వారి సంఖ్య బాగా పెరిగిందని విశాఖ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చెబుతున్నారు.
అమరావతిలో పెట్టుబడి పద్దతిలో కొనుగోలు చేస్తారు. కానీ విశాఖలో మాత్రం.. పెట్టుబడితో పాటు నివాసం ఉండేందుకు అవసరమైన ఇంటిని కొనుగోలు చేసేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారు. బోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు మరో రెండేళ్లలో ప్రారంభం కానుండటంతో పాటు .. ఇటీవలి కాలంలో ఐటీ కంపెనీలు పెట్టుబడులకు ముందుకు వస్తున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం దార్శనికత.. విజయవాడను … ఐటీహబ్ గా చేయాలన్న పట్టుదలతో ఉండటం మాత్రమే కాదు.. ప్రశాంతతను కొనసాగించేలా శాంతిభద్రతలను కాపాడటం కూడా ప్లస్ అవుతోంది.
విశాఖతో ఏ చిన్న అనుబంధం ఉన్న వారైనా సరే… కుదిరితే ఇల్లు కొనుక్కునిఅక్కడే స్థిరపడిపోవాలనుకుంటారు. ధోనీ కూడా విశాఖలో స్థిరపడాలన్న ఆలోచన గతంలో చేసినట్లుగా స్వయంగా చెప్పారు. ధనవంతులే కాదు. … అనేక మంది విశాఖ లో స్థిర నివసానికి ఆసక్తి చూపిస్తున్నాయి. వచ్చే ఐదేళ్లలో విశాఖలో లగ్జరీ నివాసాల సంఖ్య అనూహ్యంగా పెరగనుంది.