విశాఖ ఉక్కు పనితీరు అద్భుతంగా ఉందని పార్లమెంటరీ స్థాయీ సంఘం సర్టిఫై చేసింది. గత ఆర్థిక సంవత్సరం.. అంతకు ముందు ఏడాది కన్నా ఏకంగా 34 శాతం వృద్ధి సాధించిందని.. తన నివేదికలో వెల్లడించింది. కంపెనీ రుణభారాన్ని కూడా కమిటీ ప్రస్తావించారు. దాదాపు రూ.22 వేల కోట్ల రుణం ఉందంని.. ఖర్చులను తగ్గించుకుని లాభాల బాటలోకి తేవడానికి అనువైన పరిస్థితులపై దృష్టి పెట్టాలన్న అభిప్రాయం ్యక్తం చేసింది. సాధారణ ఉక్కు ఉత్పత్తులతో పాటు ఆదాయం పెంచుకోవడానికి అధిక నాణ్యత కలిగిన ఉత్పత్తులపై వైజాగ్ స్టీల్ దృష్టి సారించింది.
ప్రపంచస్థాయిలో సత్తా చాటుకోవడానికి, ద్రవ్య లభ్యత, లాభదాయకతను పెంచుకోవడానికి ఎగుమతులు పెంచింది. మొత్తంగా పార్లమెంట్ స్థాయీ సంఘం… విశాఖ ఉక్కు పనితీరు అద్భుతం అని ప్రశంసించింది. కానీ అప్పుల భారం మాత్రమే గండమని చెప్పింది. విశాఖ స్టీల్‌కు క్యాప్టివ్ మైన్స్ లేకుండానే లాభాలు తీసుకు వస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా నిర్మాణ రంగ కార్యకలాపాలు తగ్గినప్పుడు ఇబ్బంది పడుతోంది.కానీ ఇప్పుడు పరిస్థితి మెరుగుపడుతోంది. మరింత సృజనాత్మకంగా వ్యవహరిస్తూ.. క్వాలిటీ ఉత్పత్తులు తెస్తూ మార్కెట్ పెంచకుంటోంది.
ఈ క్రమంలో సంస్థ అప్పులను ఏదో విధంగా సర్దుబాటు చేయాల్సిన ప్రభుత్వం మొత్తంగా తెగనమ్మాలని అనుకుంటోంది. ఇక్కడే అనేక విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం ఫ్యాక్టరీ పనితీరు అద్భుతం ఉందని చెబుతున్నా… వంద శాతం వాటాల అమ్మకం విషయంలో కేంద్రం వెనక్కి తగ్గే చాన్స్ లేదు. ఎవరికి అమ్మాలనుకుంటున్నారో వారికి అమ్మేసే అవకాశం ఉంది. ఈ విషయంలో వెనక్కి తగ్గబోమని ఇప్పటికే అనేక సార్లు కేంద్రం పార్లమెంట్ సాక్షిగా ప్రకటించింది.