ఐదేళ్ల అమ్మాయిని రేప్ చేశారు…
నకిలీ నోట్లు హల్ చల్ చేస్తున్నాయి…
దేశంలో వేల కోట్ల కుంభకోణాలు వెలుగు చూస్తున్నాయి…
ఆడపిల్లల్ని అపహరించి మానం శీలం దోచుకుంటున్నారు…
మనదేశంలో సంచలనం సృష్టించిన కేసుల పేపర్ క్లిప్పింగ్స్ బ్యాగ్రౌండ్లో… వోటు వేసిన తర్వాత వేలు ఎన్నికల కమిషన్ వేసే సిరా చుక్కను చూపిస్తూ ఫ్రంట్ గ్రౌండ్లో విజయ్ దేవరకొండ. అతడు హీరోగా ఆనంద్ శంకర్ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ ప్రొడక్షన్స్ కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న తెలుగు, తమిళ్ బైలింగ్వల్ ఫిలిం ఫస్ట్ లుక్, ‘నోటా’ టైటిల్ విడుదల చేశారు. వోటు కాదు.. అది వేయడానికి ప్రజలు తీసుకునే నోటు ఈ కేసులకు కారణం అన్నట్టు లుక్ వుంది. రాజకీయ నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రమిది. ఈ రోజు షూటింగ్ మొదలైంది. తమిళనాట వారసత్వ రాజకీయాలపై సెటైర్ గా సినిమా తెరకెక్కుతోందని సమాచారమ్. మెహరీన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో నాజర్, సత్యరాజ్ కీలక పాత్రలు చేస్తున్నారు.