విశాఖ నగల పాలక సంస్థ మధురవాడలో అందుబాటులో ఉన్న స్థలాల్నివేలం వేస్తోంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అధారిటీ తరహాలో మౌలిక వసతులు కల్పించిన భారీ ప్లాట్లను వేలం వేయడానికి సన్నాహలు చేసింది. మధురవాడ విశాఖలోనే మంచి డిమాండ్ ఉన్న ఏరియా. పెద్దపెద్ద స్థలాలు ఉంటే బడా బడా రియల్ ఎస్టేట్ కంపెనీలు హై రైజ్ టవర్స్ నిర్మించేందుకు సిద్దంగా ఉన్నాయి.
అలాగే సేవల రంగానికి సంబంధించిన కంపెనీలు తమ ఆఫీసుల్ని నిర్మించుకోవడానికి అనువైన ప్రదేశంగా ఉటుంది. విశాలమైన రోడ్లతోపాటు స్వయంగా వీఎంఆర్డీఏ వేస్తున్న వేలం కావడంతో న్యాయపరమైన చిక్కులు కూడా ఉండవు. అందుకే ఈ వేలంలోపెద్ద సంస్థలు, వ్యక్తులు పాల్గొంటారని భావిస్తున్నారు. అయితే మొదటిసారిగా భారీగా భూములు అమ్మకాలకు పెట్టడం లేదు. కోకాపేట తరహాలో భూములు ఎకరాలకు ఎకరాలు అందుబాటులో లేవు.
మొత్తంగా ఆరు వందల స్క్వేర్ యార్డ్స్ కు పైగా ఉన్న స్థలాలు నాలుగు వరకూ వేలంలో పెడుతున్నట్లుగా వీఎంఆర్డీఏ వెబ్ సైట్ లో ఉంది. ఇప్పటికే ఈ నోటిఫికేషన్ యాక్టివ్ అయింది. జనవరిలో మొదటి వారంలో వేలం ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఆరోపణలు రాకుండా ఆసక్తి ఉన్న అందరూ వేలంలో పాల్గొనేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.